RRR Movie Latest News: కరోనా లాక్‌డౌన్ అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వివరాల కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్‌డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా ఇతర పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు సినిమా విడుదల తేదీపై ఎప్పుడూ ఓ సందేహం ఉండేది. కానీ తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ బైకుపై రైడ్ చేస్తున్న ఓ ఫొటోను మూవీ యూనిట్ విడుదల చేయగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ (RRR Movie Resumes Shoot)పై క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 13, 2021నే మూవీ విడుదల కానుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటివరకైతే పాత తేదీకే జక్కన్న రాజమౌళి ఫిక్సయినట్లు పోస్టర్ చెప్పకనే చెప్పింది. రెండు భాషలలో తారక్, చెర్రీ డబ్బింగ్ సైతం పూర్తయినట్లు తెలిపారు.


Also Read: Lol Salaam Webseries: లాల్ సలామ్ వెబ్ సిరీస్ విడుదల, ZEE5 Appలో వీక్షించండి



తారక్ కొమురం భీమ్‌గా కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా హీరో రామ్ చరణ్ పోషించాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ జతకట్టగా, రామ్ చరణ్‌ (Ram charan)కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ సైతం మరో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను అజయ్ దేవగణ్ పుట్టినరోజు కానుకగా మూవీ యూనిట్ అందించింది. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్‌ఆర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 


Also Read: Acharya Movie: మరో మైలురాయి చేరుకున్న మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook