RRR OTT: సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్!
RRR streaming from May 20th on Zee5 Premium. జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే.. అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.
RRR Movie streaming from May 20th on Zee5 Premium without pay-per-view: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఎన్నో వాయిదాల తర్వాత 2022 మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. దాదాపుగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లు వసూళ్లు చేసింది. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసి బాహుబలి పేరిట ఉన్న కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మే 20న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో స్ట్రీమింగ్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ) కానుంది. అయితే ఈ సినిమాను టీ వీఓడీ (ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్) విధానంలో అందుబాటులో ఉండనున్నట్లు జీ5 ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జీ-5లో చూడాలంటే రూ.100 పెట్టాల్సిందే అని పేర్కొంది. అయితే దీనిపై సినీ ప్రేమికులు తీవ్రంగా విమర్శించారు. థియేటర్లో డబ్బులు చెల్లించి, ఇక్కడ కూడా డబ్బుల చెల్లించాలా? అని ప్రశ్నించారు.
అన్ని పరిగలోకి తీసుకున్న జీ సంస్థ తాజాగా సినీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు పే-పర్-వ్యూ స్ట్రీమింగ్ విధానంను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే.. అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఆల్రెడీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు ఉచితంగా సినిమాను చూడొచ్చు. విషయం తెలుసుకున్న ఫాన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Puppy Bath Video: కుక్క పిల్లకి మొదటిసారి స్నానం..16 లక్షల మంది ఎందుకు చూసారో తెలుసా?
Also Read: చివరి బంతికి లక్నో ఊహించని విజయం.. హద్దులు దాటి సంబరాలు చేసుకున్న గౌతమ్ గంభీర్ (వీడియో)!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook