RRR Movie Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ థియేటర్లలో విడుదలైంది. గురువారం ఉదయం 10 గంటలకు ట్రైలర్ ను దేశంలోని పలు థియేటర్లలో విడుదల చేసింది చిత్రబృందం. మూడు నిమిషాల నిడివితో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ (RRR Movie Trailer Review) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన ఇంటెన్స్ లుక్స్ తో పాటు డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ ట్రైలర్ ను నేడు (గురువారం) సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియాలో చిత్రబృందం విడుదల చేయనుంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్టులు సృష్టిస్తుందో చూడాలి.



అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అలరించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ (RRR Movie Budget) కేటాయించినట్లు తెలుస్తోంది.


ఈ సినిమా (RRR Movie Trailer Review) లో చరణ్, ఎన్టీఆర్ ల సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (RRR Movie Release Date) రిలీజ్ కానుంది.


ALso Read: RRR Movie Censor Report: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. మూవీ రన్ టైమ్ ఎంతంటే?


Also Read: RRR Movie Trailer : ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదలపై చర్చ, ట్రైలర్ నిడివి ఎంతసేపు, ఏముంది అందులో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook