RRR Movie Censor Report: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. మూవీ రన్ టైమ్ ఎంతంటే?

RRR Movie Censor Report: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పుడా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ (RRR Movie Runtime) అధికారులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 09:20 AM IST
    • సెన్సార్ పూర్తి చేసుకున్న RRR మూవీ
    • యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ అధికారులు
    • 3 గంటల 6 నిమిషాల రన్ టైమ్ తో అలరించనున్న RRR మూవీ
RRR Movie Censor Report: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. మూవీ రన్ టైమ్ ఎంతంటే?

RRR Movie Censor Report: సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ అధికారులు చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. 186 నిమిషాలు అంటే 3 గంటల 6 నిమిషాల నిడివితో (RRR Movie Runtime) ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఆర్ఆర్ఆర్ మానియా

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కంటే ముందుగా జనవరి 7న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతో పండగ ముందుగానే రాబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో మేకర్స్ జోరు పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాన్స్ లో భీభత్సంగా క్రేజ్ తెచ్చుకున్నాయి. 

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. గురువారం (డిసెంబరు 4) ఉదయం 10 గంటలకు ట్రైలర్ ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు అదే ట్రైలర్ ను సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ 3 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించనుందని చిత్రబృందం ప్రకటించింది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి (RRR Movie Censor Report) డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ కథానాయికలుగా నటించారు. వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో (RRR Movie Budget) 'ఆర్ఆర్ఆర్'ను నిర్మించారు. జనవరి 7న (RRR Movie Release Date) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం కానుంది.

Also Read: Allu Arjun fan sensational comments : పుష్ప మూవీ తేడా కొడితే నా చావు చూస్తారు.. అల్లు అర్జున్ ఫ్యాన్‌ ట్వీట్

Also Read: Vicky Katrina Wedding Venue: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లి జరగబోయేది ఇక్కడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News