Jr NTR and Ram Charan's RRR Movie Twitter Review: నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అర్ధరాత్రే నుంచే బెన్‌ఫిట్ షోలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ టిక్కెట్ల కోసం తెలుగు సినీ ప్రియులతో పాటు యావత్‌ సినీ ప్రపంచం థియేటర్స్ వద్ద బారులు తీరారు. కొన్ని థియేటర్స్ వద్ద ఫాన్స్ హంగామా చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో.. మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో.. సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమతమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొందరు సినిమా బాగుందని పోస్ట్ చేస్తే.. మరికొందరు  పర్లేదు అని ట్వీట్లు చేస్తున్నారు. 



ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ ఇరగదీశారని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే అదిరిపోయిందట. 'ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా అబ్బుర పరుస్తోంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'థియేటర్స్ బాక్సులు బద్దలు కాకుంటే ఒట్టు.. ఊహించని మలుపులు ఉన్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ సూపర్' అని ఇంకొకరు ట్వీట్ చేశాడు. 







Also Read: Viral video: ఇంత క్రేజీ కాంబినేషన్ వంటకం ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు.. వైరల్ వీడియో!


Also Read: Neha Sharma Pics: అదిరే ఫోజులతో రెచ్చిపోతున్న రామ్​ చరణ్​ హీరోయిన్​- ఫొటోలు వైరల్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook