RRR Movie 4th Single: డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (RRR Movie Update). స్వాతంత్ర పోరాట నేపథ్య కల్పిత కథతో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమాలోని నాలుగో సాంగ్ 'రోర్ ఆఫ్ భీమ్' ను శుక్రవారం రిలీజ్ చేయనున్నట్లు చిత్రబందం ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఆ పాటకు సంబంధించిన ప్రొమోను గురువారం ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 



రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ (RRR Movie Budget) కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. (RRR Movie Trailer Review) ఇందులో హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. 


వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. సంక్రాంతి కానుకగా (RRR Pre Release Event Mumbai) జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (RRR Movie Release Date) రిలీజ్ కానుంది.   


Also Read: Indian Movie in Oscar: ఆస్కార్ రేసులో ఇండియన్ డాక్యుమెంటరీ.. పోటీ నుంచి తప్పుకున్న తమిళ చిత్రం


Also Read: Raashi Khanna Latest Pics: బ్లాక్ శారీలో చందమామలా మెరిసిపోతున్న బెల్లం శ్రీదేవి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి