Indian Movie in Oscar: ప్రపంచ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు రేసులో ఇండియాకు చెందిన ఓ డాక్యుమెంటరీ నిలిచింది. ఫీచర్ కేటగిరిలో కొన్ని డాక్యుమెంటరీ షార్ట్ లిస్టు చేయగా.. అందులో 'రైటింగ్ విత్ ఫైర్' డాక్యుమెంటరీకి చోటు దక్కింది. తదుపరి రౌండ్‌లోనూ ఎంపికయితే ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశముంది.
ఒక దళిత మహిళ నడిపిస్తున్న వార్త పత్రికకు చెందిన మహిళా రిపోర్టర్లు.. పురుషాధిక్యత, కుల వివక్ష ఉన్న సమాజంలో ఏ విధంగా తమ వృత్తిని కొనసాగించారు.. కేవలం పత్రికకే పరిమితం కాకుండా డిజిటల్‌గానూ రాణించేందుకు ఎంత కష్టపడ్డారో తెలియజేసే విధంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ ఏడాది జనవరి 30న విడుదలైన 'రైటింగ్ విత్ ఫైర్' డాక్యుమెంటరీకి ఢిల్లీకి చెందిన రింటూ థామస్, సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించారు. సునీతా ప్రజాపతి, మీరా దేవి, శ్యామ్‌కాళీ దేవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆస్కార్ పోటీల్లో మొత్తం 138 డాక్యుమెంటరీలు ఈ విభాగంలో పోటీ పడగా.. టాప్ 15 డాక్యుమెంటరీలను షార్ట్‌లిస్ట్ చేశారు. ‘రైటింగ్ విత్ ఫైర్’తోపాటు అట్టికా, ఫ్లీ, జులియా, ఫయా దాయి, ప్రెసిడెంట్ తదితర డాక్యుమెంటరీలు పోటీలో ఉన్నాయి. మరోవైపు ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో పోటీ పడిన తమిళ చిత్రం ‘కూళంగల్’.. ఆస్కార్ బరి నుంచి నిష్క్రమించింది. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది.
Also Read: Raashi Khanna Latest Pics: బ్లాక్ శారీలో చందమామలా మెరిసిపోతున్న బెల్లం శ్రీదేవి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి