Jr NTR, Ram charan, Rajamouli Green india Challenge: ఆర్ఆర్ఆర్ మూవీ మరో రెండు రోజుల్లో.. అంటే ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌కి వెళ్లొచ్చిన మూవీ యూనిట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓవైపు  ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు ఇవాళ హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని అన్నారు. రాష్ట్రం, దేశం పచ్చగా ఉండాలనే గొప్ప సంకల్పంతో సంతోష్ ముందుకు వెళ్తున్నారని అభినందించిన రాజమౌళి.. ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. గతంలో బాహుబలి టీమ్‌తో కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా రాజమౌళి గుర్తుచేశారు. 


దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని  అన్నారు. ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలను కూడా అలాగే నాటి రక్షించాలి అని విజ్ఞప్తి చేశారు.  


మొక్కలు నాటిన అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. తాను గతంలో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించానని, మొక్కలు నాటిన ప్రతీసారి ఓదో తెలియని ఉత్సాహం వస్తుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని రామ్ చరణ్ పేర్కొన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ సభ్యులు అభినందించారు. 


సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని, సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ షెడ్యూల్‌లో (RRR movie release updates) బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్‌లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.


Also read : RRR Review: 'ఆర్ఆర్ఆర్' బాక్సాఫీస్ బొనాంజా.. చరిత్రలో నిలిచిపోతుంది! 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యుడు!!


Also read : Nayanatara-Vignesh Shivan: స్టార్ హీరోయిన్ నయనతార తల్లి కాబోతుందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook