Nayanatara-Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ జంట చాలాకాలంగా సహజీవనంలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట... పెళ్లి ఎప్పుడనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. మీడియా పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా త్వరలోనే అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ జంట గురించి తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.
నయనతార-విఘ్నేశ్ శివన్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సరోగసీ ద్వారా నయనతార తల్లి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మీడియా వర్గాలు నయనతార సన్నిహితులను ఆరా తీయగా.. అందులో నిజం లేదని తేలిపోయింది. నయనతార-విఘ్నేశ్ శివన్‌లకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, కొద్దిరోజుల క్రితం నయనతార-విఘ్నేశ్ శివన్ చెన్నైలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నయనతార నుదుటిన సింధూరంతో కనిపించింది. సాధారణంగా పెళ్లయినవారే అలా నుదుటిన సింధూరం ధరిస్తారు. నయనతార అలా కనిపించడంతో ఈ ఇద్దరూ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసేసుకున్నారని మీడియా కోడై కూసింది. నయనతార, విఘ్నేశ్ శివన్ మాత్రం ఈ ప్రచారంపై స్పందించలేదు.
సినిమాల విషయానికొస్తే విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన కాతు వాకుల రెండు కాదల్ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి కాగా సమంత మరో హీరోయిన్గా కనిపించనుంది. ఇక బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ సినిమాతో పాటు తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాదర్ రీమేక్‌లో నయనతార నటిస్తోంది.
Also Read: Delhi Crime Issue: 2 నెలల పసికందు..మైక్రోఓవెన్లో పెట్టి చంపేసిన ఆ ఘటిక తల్లి
Also read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook