RRR Naatu Naatu Step: నాటు నాటు సాంగ్ కు కాలు కదిపిన జపనీస్ యూట్యూబర్..ఏమి గ్రేస్ అయ్యా?
Naatu Naatu Hook Step By Japanese YouTuber Mayo: జపాన్లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన సంధర్భంగా సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ తరువాత యూట్యూబర్ వేసిన నాటు నాటు స్టెప్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు
Naatu Naatu Hook Step By Japanese YouTuber Mayo's Video Goes Viral: రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా సుమారు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా భారత దేశంలో మార్చి 25వ తేదీన విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మంచి పేరు తెచ్చుకోవడమే కాక కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది.
ఈ సినిమాని కేవలం తెలుగు భాషల్లోనే కాదు కొన్ని దేశ భాషలలో అలాగే కొన్ని విదేశీ భాషలలో కూడా విడుదల చేశారు. తాజాగా జపాన్ మార్కెట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో జపాన్లో అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమాని జపనీస్ భాషలో విడుదల చేశారు. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కార్తికేయ వంటి వారు అక్కడికి వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనేక మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఇక యూట్యూబ్ స్టార్లను కూడా పిలిపించుకుని వారికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలా వీరిని ఇంటర్వ్యూ చేసిన ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటికి వెళుతూ దారిలో ఆనందాన్ని పట్టలేక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన నాటు నాటు అనే సాంగ్ స్టెప్ ని జపాన్ రోడ్లమీద వేసి ఆ వీడియోని తమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, యూట్యూబర్ మాయో తన స్నేహితుడితో కలిసి నాటు నాటు సాంగ్‌కి ఉత్సాహంగా కాలు కదిపారు.
అలా పంచుకోవడమే కాదు ఇంటర్వ్యూ నుంచి వెళుతుంటే ఉత్సాహాన్ని ఆపుకోలేక ఇలా చేసామంటూ ఆవిడ కామెంట్ చేశారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్లో మంచి కలెక్షన్లు దిశగా దూసుకుపోతుందని టాక్ వినిపిస్తోంది. మొదటి రోజు ఆశించిన మేర ఫలితం లేకపోయినా రెండో రోజు కాస్త పుంజుకుందని అంటున్నారు. మూడవరోజు ఆదివారం కావడంతో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి..
మరి సదరు జపనీస్ యూట్యూబర్ వేసిన నాటు నాటు స్టెప్ మీరు కూడా చూసేయండి మరి. ఇక ఈ సినిమాని డివివి దానయ్య సుమారు 450 కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మించగా సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. అలాగే రాజమౌళి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అనేక విభాగాల్లో పనిచేశారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ వంటి వారు హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రేయా శరన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Also Read: Prabhas Fans : ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. థియేటర్లో అగ్నిప్రమాదం?
Also Read: Hero Akhil Raj: బీచ్లో కొట్టుకుపోయిన యువహీరో.. చావు తప్పి కన్నులొట్ట బోయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook