RRR Crazy Update: డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్
ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల కాకముందే ఈ సినిమా కొత్త రికార్డు శృష్టించింది. డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ రికార్డు శృష్టించింది.
Crazy Update from RRR: రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్ తేదీ దగ్గరపడింది. మార్చ్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరు పెంచేసింది నిర్మాణ సంస్థ. వచ్చే పది రోజుల్లో మూవీపై మరింతగా ప్రచారం చేయనుంది.
తాజాగా ఎత్తర జెండా సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హిందీలో ఈ సాంగ్‌కు షోలే అని టైటిల్ ఖరారు చేశారు. ఈ పాటను మార్తి 14న విడుదల చేయనున్నారు. ఈ పాట విడుదల తరువాత చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు యూనిట్ సభ్యులు.
ఇక ఈ ఎత్తర జెండా ఆంథెమ్ సాంగ్ టీజర్‌లో ఆలియా... ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి స్టెప్పులేసింది. చాలా ప్రెట్టీగా కనిపిస్తోందంటూ అభిమానులు ఆలియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వందే మాతరం అని రాసిన జెండా ఎగరేస్తూ దేశ భక్తిని చాటారు. సీత పాత్రలో నటిస్తున్న ఆలియా ఈ సాంగ్‌లో పింక్ కలర్ చీరలో వెరైటీ హెయిర్ స్టయిల్‌లో కనిపించింది.
భారతీయ సినిమా చరిత్రలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్నతొలి భారతీయ సినిమాగానూ రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. 197 డాల్బీ స్క్రీన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ అలరించనుంది. తాజాగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆప్ డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఏ ఇతర తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కలేదు. అక్కడ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్... 24వ తేదీ నుంచే ప్రీమియర్ షోలతో అలరించనుంది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీంలు స్వాతంత్ర్య పోరాటానికి ముందు ఎలా ఉండేవారు అనే ఫిక్షనల్ ఐడియాతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్ దేవ్ గన్, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది ఆర్‌ఆర్‌ఆర్.
Also Read: Polavaram Project: పోలవరంలో కీలక ఘట్టం.. ప్రాజెక్టు గేట్లు అమరిక పూర్తి
Also Read: Tragedy: విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook