Tragedy: విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...

Warangal Tragedy:  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు చెరువులో దిగి మునిగిపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 05:03 PM IST
  • వరంగల్ నర్సంపేటలో విషాదం
  • ఒకరిని రక్షించబోయి మరొకరు.. చెరువులో పడి ముగ్గురు మృతి
  • ఒకే కుటుంబంలోని మూడు తరాల వ్యక్తులు మృతి
Tragedy: విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...

Warangal Tragedy: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు చెరువులో దిగి మునిగిపోయారు. ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన ముగ్గురు ఒకేసారి మృతి చెందడం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో కృష్ణ మూర్తి (65) అనే వ్యక్తి తనకున్న పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. పొలం పనుల్లో కృష్ణమూర్తికి సాయం చేసేందుకు కుమారుడు నాగరాజు (34), మనవడు దీపక్ (12) అక్కడికి వచ్చారు. పొలంలో మొక్కజొన్న పనులు పూర్తయిన తర్వాత కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు.. పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు కృష్ణమూర్తి. ప్రమాదవశాత్తు అతను చెరువులో పడిపోవడంతో మనవడు దీపక్ తాత వద్దకు పరిగెత్తుకెళ్లాడు. తాతను రక్షించేందుకు చెరువులోకి దిగి అతనూ మునిగిపోయాడు.

తండ్రి, కొడుకు చెరువులో మునిగిపోవడం గమనించిన నాగరాజు.. ఆ ఇద్దరిని రక్షించేందుకు అతను కూడా చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నాగరాజు కూడా చెరువులోనే మునిగిపోయాడు. చెరువు లోతు ఎక్కువగా ఉండటం వల్లే ముగ్గురు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్థానికులకు ఫిర్యాదు అందడంతో.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: India vs Sri Lanka 2nd Test: ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్...టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం..  

Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News