Anchor Suma Hilarious fun with Varun Tej in RRVV Pre Release Event: మెగా హీరో వైష్ణవ్‌ తేజ్, యువ హీరోయిన్ కేతికా శర్మ జంటగా రూపొందిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. కొత్త దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్‌ కానుంది. రంగ రంగ వైభవంగా సినిమా విడుదలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రంగ రంగ వైభవంగా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగా హీరోస్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వచ్చారు. సినిమా గురించి అందరూ మాట్లాడాక.. యాంకర్ సుమ మెగా హీరోస్ ముగ్గురికి ప్రశ్నల వర్షం కురిపించారు. ముగ్గురికి (వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్) సంబందించిన ప్రశ్నలు అడగ్గా వారు ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. మీ ముగ్గురిలో ఎక్కువగా సోషల్ మీడియా వాడేది ఎవరు అని అడగ్గా.. తానే అంటూ సాయి చెప్పాడు. ముగ్గురిలో ఎక్కువగా అబద్దాలు చెప్పేది ఎవరూ అని అడగ్గా.. సాయి అస్సలు చెప్పడు, నెను ఒకపుడు చెప్పేవాడిని, ఇప్పుడు వైష్ణవ్‌ చెపుతున్నాడు అని వరుణ్ బదులిస్తాడు. 


మీలో ఎక్కువగా ఎవరికీ తెలివితేటలు ఉన్నాయి అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. వరుణ్ అన్నకు అని వైష్ణవ్‌ తేజ్ చెపుతాడు. వెంటనే వరుణ్ అందుకుని.. వైష్ణవ్‌ ఫీలింగ్ అతడే తెలివైనవాడు కానీ నా పేరు చెబుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి మీ ముగ్గురిలో ఎవరు బాగా క్లోజ్ అని అడగ్గా.. వరుణ్ పేరు చెపుతాడు సాయి. ముగ్గురిలో లేజీ ఎవరు అని అడగ్గా.. వరుణ్ నేనే అన్ని బదులిస్తాడు. ముగ్గురు చేసిన ఏదైనా క్రేజీ పని చెప్పండి, చిన్నపుడు గోడలు దూకడం లాంటివి ఏమైనా చేశారా? అని సుమ అడిగితే.. మాకు ఏజ్ గ్యాప్ ఉందని వరుణ్ బదులిస్తాడు. నేను, తేజ్ చేసిన పనుల్లో వైష్ణవ్‌ లేడు మెగా ప్రిన్స్ చెపుతాడు. 


Also Read: నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు


Also Read: IND vs HK: హాంకాంగ్‌తో భారత్ మ్యాచ్‌.. కేఎల్ రాహుల్ ఔట్! టీమిండియా తుది జట్టు ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి