Rudra Garuda Puranam: అశ్విని ఆర్ట్స్ బ్యానర్ పై అశ్విన్ విజయ్ లోహిత్ తెరకెక్కించిన చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. బైలింగ్విల్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేసారు. హీరో సోహైల్ తెలుగు టీజర్‌‌ను విడుదల చేశారు.
 
హీరో  సోహైల్ మాట్లాడుతూ..
కన్నడ మూవీని తెలుగులో కూడా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ చాలా బాగుందన్నారు.  కొత్త కంటెంట్‌ను  తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కేజీయఫ్, కాంతారా దగ్గర నుంచి రీసెంట్‌గా వచ్చిన  లవ్ టుడే, మహారాజా, 777 ఛార్లీ, మంజుమ్మల్ బాయ్స్ లాంటి  కంటెంట్ బేస్డ్  సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ మూవీ  టీజర్ చూశాక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌లా ఉంది. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేసారు. నందీశ్వర్ గారు చాలా బాగా తీశారు. రిషి గారి హైట్, పర్సనాలిటీకి ఇది  ఫరెక్ట్‌ సినిమా. నాలుగు భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్మాత  మధుర శ్రీధర్ మాట్లాడుతూ..


రిషి నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూశాను. ఆయన టెర్రిఫిక్ ఆర్టిస్ట్. తనతో పాటు టీమ్ అందరికీ ఈ సినిమా విజయం సాధించాలని  కోరుకుంటున్నట్టు తెలిపారు.  


చిత్ర హీరో రిషి మాట్లాడుతూ..


‘కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మధుర శ్రీధర్ కి, సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహైల్ కి కృతజ్ఞతలు. దర్శకుడు మహి వి రాఘవ  ‘సైతాన్’  ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు నన్ను పరిచయం చేశారు. గరుడ పురాణం ఎలిమెంట్స్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్న సినిమా ఇది. రుద్ర అనే పవర్‌‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా సినిమా ఉంటుందన్నారు. చాలా ప్యాషనేట్‌గా నందీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.  తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ మరోసారి అందిస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నట్టు చెప్పారు.   


హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ...
ఈ చిత్రంలో భాగమవడం చాలా హ్యాపీగా ఉందన్నారు. మంచి కంటెంట్‌ను  తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారన్నారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతందన్నారు.  


దర్శకుడు నందీష్ మాట్లాడుతూ..
‘మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నిర్మాత మధుర శ్రీధర్ కి, హీరో సోహైల్ కి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు. మా హీరో రిషి ఇప్పటికే ఓ తెలుగు సినిమా చేశారు. ఈ  చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
నిర్మాత విజయ్ లోహిత్ మాట్లాడుతూ.. ‘మ బ్యానర్ అశ్విని ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న మొదటి చిత్ర మిది. బై లింగ్విల్‌ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు  ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.   


నటుడు జ్వాల కోటి, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నటీనటులు : రిషి, ప్రియ కుమార్, జ్వాల కోటి తదితరులు..బ్యానర్ : అశ్విన్ ఆర్ట్స్.. కథ, కథనం, దర్శకత్వం : కేఎస్ నందీష్..సినిమాటోగ్రాఫర్ : సందీప్..మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ ప్రసాద్
నిర్మాత : అశ్విని విజయ్ లోహిత్.


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి