Pawan Kalyan Next: పవర్ స్టార్ సినిమా పేరు అదేనా ? ఆ పుకార్లలో నిజమెంత ?
విజయదశమి సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కొత్త సినిమా ప్రకటన సోషల్ మీడియా వేదికగా జరిగింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. పవన్ కళ్యాణ్ అయ్యాపనమ్ కోషియం చిత్రం రీమేక్ వర్షన్ లో నటిస్తారని సమాచారం.
విజయదశమి సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కొత్త సినిమా ప్రకటన సోషల్ మీడియా వేదికగా జరిగింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. పవన్ కళ్యాణ్ అయ్యాపనమ్ కోషియం చిత్రం రీమేక్ వర్షన్ లో నటిస్తారని సమాచారం. ఇందులో ఆయన ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్ పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అప్పుడే పుకార్లు మాత్రం వచ్చేస్తున్నాయి.
Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకెషేన్ నుంచి ప్రభాస్ అండ్ టీమ్ ఫోటోలు
తాజాగా వినిపిస్తున్న పుకారు ప్రకారం ఈ మూవీని బిల్లా రంగా ( Billa Ranga ) అని టైటిల్ పెట్టాలి అని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ పుకారు మాట కాస్త అటుంచితే మూవీ దర్శకుడు సాగర్ చంద్ర మాటలను బట్టి ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
Also Read | YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు అని.. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తెలుస్తోంది. సితారా ఎంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి (Rana Daggubati ) కీలక పాత్రలో కనిపించనున్నారట.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR