Jai Balayya Slogan నందమూరి అభిమానులు జై బాలయ్య స్లోగన్‌ను ఎంతగా ఫేమస్ చేశారో అందరికీ తెలిసిందే. చివరకు జై బాలయ్య అనే పాటను సమయం సందర్భం సంబంధం లేకున్నా సరే వీర సింహా రెడ్డి సినిమాలో పెట్టుకున్నారు. వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య పేరు ఏంటి? ఆ పాటలో ఉన్న పేరు ఏంటి? అనేది కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. జై బాలయ్య అనే పాటను పెట్టేశారు. అయితే ఇప్పుడు తాజాగా తమన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవింద నామస్మరణం, జై బాలయ్య అనే స్లోగన్‌ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తాయట. అందుకే జై బాలయ్య అనే పాటను పెట్టినట్టుగా తమన్ చెప్పుకొచ్చాడు. దీంతో కొంత మంది నెటిజన్లు తమన్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవి రెండూ ఒకటేనా? అంటూ నిలదీస్తున్నారు. భక్తితో అనే గోవిందా గోవిందా నామస్మరణకు, జై బాలయ్యకు తేడా ఉండదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 




అసలే తమన్ ఈ మధ్య ట్రోలర్లకు ఎక్కువగా దొరుకుతున్నారు. తమిళంలోకి వెళ్తే విజయ్ ఫ్యాన్ అని అంటున్నాడు.. ఇక్కడకు వస్తే.. బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ ఇలా అందరికీ అభిమానిని అని అంటున్నాడు.. దీంతో జనాలు తమన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి తమన్ ఇప్పుడు ఈ గోవింద నామస్మరణ వ్యాఖ్యలతో మరోసారి దొరికాడు.


తమన్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ గోవింద నామస్మరణ మీద చేసిన వ్యాఖ్యలు, జై బాలయ్య స్లోగన్‌తో పోల్చిన తీరు మీద కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి