Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

Vaarsudu Telugu Movie Review దళపతి విజయ్ నటించిన తమిళ సినిమా వారిసు తెలుగులో వారసుడుగా రాబోతోంది. తమిళంలో ఆల్రెడీ విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. మరి ఈ సినిమా తెలుగు వారిని మెప్పిస్తుందా? లేదా? అన్నది చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2023, 11:39 AM IST
  • నేడు థియేటర్లోకి వారసుడు
  • తమిళంలో దుమ్ములేపుతున్న విజయ్
  • వారసుడు కథ, కథనాలు ఏంటంటే?
Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

Vaarsudu Telugu Movie Review వంశీ పైడిపల్లి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత అంటే సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పక్కా తెలుగు సినిమా తీస్తూ ఉన్నా కూడా అది పక్కా తమిళ సినిమా అని, విజయ్ సినిమా అని చెబుతూ వచ్చారు. ట్రైలర్ చూస్తే అది మన తెలుగు సినిమా అని అర్థమైంది. మరి ఈ చిత్రం తమిళంలో ఆల్రెడీ రిలీజై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక్కడ తెలుగు వారి ముందుకు ఈ చిత్రం ఇప్పుడు వచ్చింది. ఈ సినిమా మన ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథ
రాజేంద్ర (శరత్ కుమార్) కోటీశ్వరుడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. జై (శ్రీకాంత్), అజయ్ (కిక్ శామ్), విజయ్ (విజయ్). ఇక ఈ లగ్జరీ జీవితానికి, తండ్రి వారసత్వానికి విజయ్ దూరంగా ఉంటాడు. ఏడేళ్ల తరువాత విజయ్ మళ్లీ ఇంటికి వస్తాడు. అమ్మ పిలుపుతో విజయ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. అయితే రాజేంద్ర క్యాన్సర్‌తో బాధపడుతుంటాడు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడని తెలుసుకుంటాడు. అలాంటి సమయంలో తన పెద్ద కొడుకులు తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అర్హత లేదని తెలుసుకుంటాడు. తన చిన్న కొడుకు విజయ్‌ని వారసుడిగా ప్రకటిస్తాడు. ఆ తరువాత తన అన్నల నుంచి విజయ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ముక్కలైన కుటుంబాన్ని ఒక్కటి చేయడానికి విజయ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? కుటుంబంలో సమస్యలు పుట్టించేందుకు జయ ప్రకాష్‌ (ప్రకాష్‌ రాజ్) చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు విజయ్ తన కుటుంబాన్ని ఒక్కటి చేశాడా? అన్నది కథ.

నటీనటులు
విజయ్ ఓ ఫ్యామిలీ స్టోరీ చేసి చాలా కాలమే అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కంటతడి పెట్టించే సీన్స్‌లో విజయ్ మెప్పిస్తాడు. విజయ్‌లోని మాస్ ఇమేజ్‌ను బాగానే వాడుకున్నారు. యాక్షన్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లో అదరగొట్టేశాడు. రష్మిక అయితే పాటలకు మాత్రమే అన్నట్టుగా ఉంది. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శరత్ కుమార్, జయ సుధలు జంటగా అంతగా మెప్పించకపోయినా.. ఎవరి పాత్రలో వారు చక్కగా నటించారు. శ్రీకాంత్, సంగీత, కిక్ శ్యామ్, యోగి బాబు ఇలా అందరూ మెప్పించారు. ప్రకాష్‌ రాజ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
వంశీ పైడిపల్లి కొత్త కథలు ఎంచుకోవడమే మానేసినట్టు కనిపిస్తోంది. పాత కథలే, రొటీన్ పాయింట్లే తీసుకున్నా సరే.. మేకింగ్‌లో అయినా మార్పులు వస్తాయేమో అని ఆశిస్తే భంగపాటు కలగాల్సిందే. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి సినిమాలో లగ్జరీ ఫైట్లు, స్పెషల్ చార్ట్‌డ్ ఫ్లైట్లు, విశాలమైన ఆఫీస్ గదులు, క్రికెట్ గ్రౌండ్ అంత ఉండే ఇళ్లు వంటివి ఇందులోనూ చూపించాడు. వారసుడు సినిమా చూస్తుంటే ఎక్కడా కూడా తమిళ సినిమాలా అనిపించదు.

పక్కా తెలుగు సినిమా అని, అది కూడా ఎప్పుడో అరిగిపోయిన కథను మళ్లీ తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను చూస్తుంటే మనకు లెక్కలేనన్ని తెలుగు సినిమాలు గుర్తుకు వస్తాయి. ఏ ఒక్క షాట్, ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. లక్ష్మీ, బృందావనం, మహర్షి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఇలా లెక్కలేనన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. కథ పాతది కాదు.. ఇలాంటి కథలో విజయ్ నటించడం మాత్రమే కొత్త. కనీసం అదైనా కనెక్ట్ అయ్యేలా ఉందా? అంటే చెప్పడం కష్టమే.

ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే ఎక్కువ సంఘర్షణలుంటాయి. చెల్లాచెదురైన కుటుంబాన్ని ఒక్కటి చేయడం, తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు విజయ్ చేసే ప్రయత్నాలు, వాటికి అడ్డు పడే అన్నల ప్రయత్నాలతో ద్వితీయార్థం నడుస్తుంది. అయితే ఈ కథ ప్రారంభం నుంచి ఆరంభం వరకు ప్రేక్షకుడి ఊహకు అందేలానే సాగుతుంది. ఏ ఒక్క చోట కూడా సర్ ప్రైజింగ్ మూమెంట్స్ ఉండవు. అదే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్.

కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి.. కానీ అర్థమే కానట్టుగా ఉంటాయి. విజువల్స్ పరంగా సినిమాను ఎంతో రిచ్‌గా తీశారు. సినిమా కోసం పెట్టిన బడ్జెట్ అక్కడే కనిపిస్తోంది. సినిమా నిడివి కాస్త ఇబ్బంది పెట్టేలానే అనిపిస్తుంది. యాక్షన్ డోస్ ఎక్కువే అయినట్టు అనిపిస్తుంది. కానీ విజయ్ ఇమేజ్‌కు ఆ మాత్రం ఉండాల్సిందేలే అని సగటు ప్రేక్షకుడు కూడా సర్దుకు పోయేలానే ఉంది. 

రేటింగ్ : 2.5

బాటమ్ లైన్‌ : వారసుడు.. ఇక వంశీ పైడిపల్లి మారడు!

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News