Sa re ga ma pa reality show 2022: కోటి, ఎస్‌పి శైలజ, స్మిత, అనంత శ్రీరామ్, గీతా మాధురి, రేవంత్, శ్రీ కృష్ణ, సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌడిన్య ' స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' ట్రోఫీని ఆవిష్కరించడం జరిగింది. అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచిపెడతాయి. అలాంటి ఛానల్ నుంచి మరోసారి అందరూ మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో 'స రి గ మ ప', ఇపుడు 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' గా మన ముందుకి వచ్చేస్తుంది. ఈ ఆదివారం, ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కానుంది. ఎవరు ముందుకి వెళ్తారు, ఎవరు వెనుతిరుగుతారో తెలియాలంటే, ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు తప్పక వీక్షించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేదిక నుంచి ఎంతో మంది ప్రతిభావంతులు ఇవాళ టాలీవుడ్ సంగీత ప్రపంచంలో దిగ్గజాలుగా స్థిరపడ్డారు. అలాంటి ధృవ తారల్ని మెంటార్స్‌గా ఈ సీజన్‌లో కూడా మన ఛానల్ ప్రవేశ పెడుతుంది. వారే - గీతా మాధురి, రేవంత్, శ్రీ కృష్ణ, సాకేత్ కొమాండూరి. అంతేనా, ఈ గాయనీగాయకులను వారి అనుభవాలతో, వారి సంగీత విజ్ఞానంతో సానపెట్టడానికి ఈ సీజన్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఫేమస్ సింగర్స్ ఎస్‌పి శైలజ, స్మిత, గీత రచయిత అనంత శ్రీరామ్ జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ వైవిధ్యాన్ని, కంటెస్టెంట్స్ ప్రతిభను, వారి కథల్ని వీక్షకుల ముందుకు తీసుకురావడానికి యాంకర్ శ్రీ ముఖి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.


Sa re ga ma pa reality show 14th season: కొత్త సీజన్ ప్రారంభానికి ముందు, మీడియా కోసం మ్యూజికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది మన జీ తెలుగు. ఫిబ్రవరి 18 నాడు సాయంత్రం హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జెస్ కోటి, ఎస్‌పి శైలజ, స్మిత, అనంత శ్రీరామ్‌తో పాటు మెంటార్స్ గీతా మాధురి, రేవంత్, శ్రీ కృష్ణ, సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌడిన్య పాల్గొన్నారు. కొత్త సీజన్ గురించి మాట్లాడడమే కాకుండా.. స రి గ మ ప 13వ సీసన్ కంటెస్టెంట్స్ పాటలు అందరిని చాలా ఆకట్టుకున్నాయి. అంతేనా, ఈ సీజన్ ట్రోఫీని ముందుగానే అందరూ కలిసి ఆవిష్కరించారు.
 
Sa re ga ma pa reality show 2022 contestants: సంద్యా సాయంత్రం వేళలో మెగా లాంచ్ ఎపిసోడ్ నుండి కొన్ని మైమరిపించే క్షణాలతో పాటుగా ఈ సీజన్‌లోని పోటీదారులైన కర్నూలు నుండి దాసరి పార్వతి, తూర్పు గోదావరి నుండి డేనియల్, కడప నుండి వినోద్, కేరళ నుండి అరుణ్ విజయ్, కర్నూల్ నుండి వినూత్న, చిక్‌బల్లాపూర్ నుండి చరణ్ తేజ్, హైదరాబాద్‌కు చెందిన నిఖిత నాదెళ్ల, సాయి శ్రీచరణ్, అఖిల్ సంజోయ్, ఐషిత శెట్టి, శ్రీ సాయి సంవిద్, సాయి వల్లి శివాని, శృతికా సముద్రాల, కాకినాడ నుండి అభినవ్ అవసరాల , ముంబైకి చెందిన అస్తా లోహర్, నెల్లూరుకు చెందిన ప్రశాంతి, ఇపురుపాలెంకు చెందిన షేక్ రసూల్, విజయవాడకు చెందిన కీర్తన శ్రీనివాస్, అమెరికా నుండి ప్రణవ్ కౌశిక్ , వరంగల్ నుండి కళ్యాణి చింత, చెన్నైకి చెందిన స్వరూప్ కార్తీక్, విశాఖపట్నం నుండి సత్యశ్రీ, కడప నుండి వినోద్ శర్మ ఇంద్రకంటి, వనపర్తికి నుండి హర్ష గన్నోజి, కాకినాడ నుండి సాయి వల్లి శివాని, రాజమండ్రి నుండి వెంకట సుధాంశు, అమలాపురం నుండి వల్లి గాయత్రి, వరంగల్‌కు చెందిన మైనా కంటెం, మచిలీపట్నం నుంచి హృతికా ఆనంది, బెంగళూరుకు చెందిన దీప్తి భట్‌ మ్యూజికల్ జర్నీ మీడియాకు చూపించడం జరిగింది. వారి ఇనిస్పిరేషనల్ స్టోరీస్‌తో పాటు గ్రాండ్ ప్రీమియర్ నుండి మెస్మరైజింగ్ మూమెంట్స్ ఎన్నో ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కాబోతున్నాయి. 


Music composer Koti - స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ జడ్జెస్‌లో ఒకరైన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. "నేను స రి గ మ ప తో మొదటి నుంచి ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు 14 వ సీజన్‌తో మళ్లీ అందరి ముందుకి వస్తున్నాం. ఇంతలా ఆదరిస్తునందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈసారి కూడా మీ అందరి అంచనాలని దాటి మెరుగైన గాయనీగాయకులని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా వారందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.



Singer SP Shailaja - ప్రముఖ నేపథ్య గాయని ఎస్‌పి శైలజ మాట్లాడుతూ.. "మరోసారి అందరిని స రి గ మ ప ద్వారా కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఈ వేదిక ప్రతిభావంతులని అక్కున చేర్చుకొని వారికివారే సాటి అనే విధంగా తీర్చిదిద్దుతుంది. నేను ఎప్పటిలాగే ఈసారి కూడా వారిని ప్రోత్సహిస్తూ, అనుభవాలని పంచుకుంటూ, వారిని ది సింగింగ్ సూపర్ స్టార్ చేయడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను" అని తెలిపారు.



 


Singer Smitha - స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ స్మిత మాట్లాడుతూ, "నేను కూడా ఇలాంటి ఒక ప్లాట్‌ఫామ్ నుంచే వచ్చాను. చిన్నప్పటి నుంచి సంగీతం నాతోనే ఉంది. ఈ స్టేజి మీదికి రావాలంటే ఎంత కష్టపడ్డారో నేను ఉహించగలను. ఈ సీజన్‌లో క్వాలిటీ సంగీతంతో పాటు గుండెకు హత్తుకొనే ఎన్నో కథలని అందరు చూడగలుగుతారు. వారి పాటలే కాదు వారి కథలు కూడా అందరికి ప్రేరణగా నిలుస్తాయని భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు.


Anantha Sriram - ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. “స రి గ మ ప ఎంతోమంది జీవితాలని మార్చివేసింది. మరోసారి అందరి ముందుకి రాబోతుంది. ఈసారి కూడా తెలుగు ప్రజలందరు కలిసి మనసుని తట్టి లేపే ఆ సింగింగ్ సూపర్ స్టార్‌ని ప్రపంచానికి చూపిస్తారని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.


Sa re ga ma pa reality show timings - ఈ సీజన్‌లో 24 మంది ప్రతిభావంతులైన పార్టిసిపెంట్లు 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' టైటిల్ కోసం పోరాడుతున్నారు. న్యాయనిర్ణేతలు, మెంటార్స్ వారికి మార్గదర్శకత్వం వహిస్తుండగా, మంత్రముగ్ధులను చేసే ట్రోఫీని ఎవరు ఇంటికి తీసుకువెళతారో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగు తప్పక వీక్షించండి.


Watch Saregamapa reality show - మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు, ఎలా పాడుతారు, వారి పర్సనల్ లైఫ్ ఏంటి, వారి మ్యూజికల్ జర్నీ ఎలా సాగింది, బుట్ట బొమ్మకి ఎవరు నచ్చారు, కోటి స్టెప్స్, స్మిత అనుభూతులు చూడాలంటే ఈ ఆదివారం ఫిబ్రవరి 20 సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో (Zee Telugu TV channel) తప్పక చూడండి. అలాగే ఈ సమరంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 27 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు స రి గ మ ప సింగింగ్ రియాలిటీ షో తప్పక వీక్షించండి.


Also read : Bheemla Nayak Tickets Booking: భీమ్లా నాయక్ టికెట్స్ బుకింగ్‌పై నిర్మాత ట్వీట్.. బూతులు తిడుతున్న ఫ్యాన్స్


Also read : Sunny Leone PAN Card: అయ్యో హతవిది.. గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయిన సన్నీ లియోన్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook