Bheemla Nayak Tickets Booking: భీమ్లా నాయక్ టికెట్స్ బుకింగ్‌పై నిర్మాత ట్వీట్.. బూతులు తిడుతున్న ఫ్యాన్స్

Bheemla Nayak Tickets Booking: భీమ్లా నాయక్ సినిమా ప్రోడ్యూసర్​ నాగ వంశీపై పవన్ కల్యాణ్​ ఫ్యాన్స్​ ఫైర్ అవుతున్నారు. ఆయన చేసిన ట్వీట్​కు బూతులతో కామెంట్స్ పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 10:42 AM IST
  • భీమ్లా నాయక్ ప్రోడ్యూసర్​పై పవన్ ఫ్యాన్స్ ఫైర్​
  • టికెట్​ బుకింగ్స్ ట్వీట్​కు బూతులతో కామెంట్స్​
  • సినిమా అప్​డేట్స్​పై అసంతృప్తి!
Bheemla Nayak Tickets Booking: భీమ్లా నాయక్ టికెట్స్ బుకింగ్‌పై నిర్మాత ట్వీట్.. బూతులు తిడుతున్న ఫ్యాన్స్

Bheemla Nayak Tickets Booking: సాధారణంగా పవన్​ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్​ పండుగ చేసుకుంటారు. మొదటి రోజే సినిమా చూసేందుకు పనులన్నీ మానుకుని మరి సిద్ధంగా ఉంటారు.. బెనిఫిట్ షో మొదలుకుని.. మిడ్​ నైట్ షో అయినా సరే మొదటి రోజు చూడాలని సిద్ధమవుతుంటారు. పవన్​ ఫ్యాన్స్​ సందడిని దృష్టిలో పెట్టుకుని థియేటర్ల యాజమాన్యాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి.

భీమ్లా నాయక్​ కోసం వెయిటింగ్​..

త్వరలో విడుదల కానున్న భీమ్లా నాయక్ సినిమా కోసం కూడా ఫ్యాన్స్​ అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇది మల్టీ స్టారర్​ సినిమా కూడా. దీనితో ఫ్యాన్స్​ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ నెల 25న థియేటర్లలో సినిమా విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినప్పటికీ.. ఫ్యాన్స్​ అప్పుడే థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్​ నాగ వంశీ..  భీమ్లా నాయక్​ సినిమా టికెట్​ బుకింగ్స్​ ప్రారంభమైనట్లు ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చూసి ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారనుకుంటే.. సీన్ రివర్స్ అయింది.

ఫ్యాన్స్​ ఫైర్..

ఈ ట్వీట్​కు ఫ్యాన్స్​ బండ బూతులతో కామెంట్స్ చేసుతున్నారు. అదేమిటి టికెట్స్ బుకింగ్ ప్రారంభిస్తే ఫ్యాన్స్​ సంతోష పడకుండా ఎందుకు బూతులు తిడుతున్నారు అని అనుకుంటున్నారా? అయితే ఫ్యాన్స్​ కోపానికి అసలు కారణం టికెట్​ బుకింగ్స్ ప్రారంభించడం కాదండోయ్​.. ట్రైలర్ అప్​డేట్ గురించి.

ట్రైలర్​ ఎప్పుడంటూ..

హాడావుడిగా భీమ్లా నాయక్​ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు.. ఇంకా ఇంతర వరకు ట్రైలర్ మాత్రం విడుదల చేయలేదు. సినిమా విడుదలకు కేవలం ఆరు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఇంకా ట్రైలర్​ రిలీజ్​ చేయకపోవడంతో పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​ అసంతృప్తితో ఉన్నారు.

సాధారణంగా సినిమా విడుదలకు కనీసం పది రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తుంటారు. కానీ భీమ్లా నాయక్ విషయంలో అలా జరగలేదు. ఫ్యాన్స్ ఈ విషయంపై తెగ వెయిట్ చేస్తుండగా.. టికెట్స్​ బుకింగ్​ ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాత నాగ వంశీ ట్వీట్​ చేయడంతో.. ఫ్యాన్స్ ఒక్క సారిగా ఫైర్ అయ్యారు. ముందు ట్రైలర్ రిలీజ్​ చేయండి అంటూ మండి పడుతున్నారు.

ట్రైలర్ ఇవ్వకుంటే సినిమా హైప్​ మొత్తం పోతుంది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరేమో మీమ్స్​తో సెటైర్లు వేస్తున్నారు.

ట్రైలర్​ అప్​డేట్​ ఇలా..

అయితే శుక్రవారం రోజు ట్రైలర్​ గురించి కూడా అప్​డేట్​ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ. ట్రైలర్ రిలీజ్ ఉంటుందని చెప్పినా.. ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

భీమ్లా నాయక్ సినిమా విశేషాలు..

ఈ సినిమాలో పవన్​ కల్యాణ్​, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సినిమాకు ఇది రీమేక్​. ఇందులో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్​లు హీరోయిన్లు.

ఈ సినిమాకు సాగర్​ కే చంద్ర దర్శకత్వం. త్రివిక్రమ్​ మాటలు, స్క్రీన్​ప్లే అందించారు. తమన్​  మ్యూజిక్ ఇచ్చారు.

సితారా ఎంటర్​టైన్మెంట్స్​, హారికా అండ్​ హాసిని క్రియేషన్స్ పతాకాలపై నాగ వంశీ, రాధా కృష్ణలు నిర్మించారు. సినిమా బడ్జెట్ అంచనా రూ.75 కోట్లు.

కాగా ఈ సినిమాలో బ్రహ్మానందం, సముద్రకని, మురళీ శర్మ, రఘుబాబు సహా పలువురు నటీనటులు ఉన్నారు.

Also read: Bhimlanaik producer: నోటిదురుసు ఫలితం ఆ నిర్మాతకు బాగా తెలిసొచ్చింది

Also read: Bhimla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్​ పూర్తి- 25న మూవీ రిలీజ్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News