Prabhas Health News ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఈ మధ్య ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొన్ని సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో ప్రారంభించాల్సిన సినిమా షూటింగ్‌ను ఆపేశారని తెలిసిందే. అయితే ప్రభాస్ ఆరోగ్యం మీద మాత్రం రకరకాల కామెంట్లు వినిపించాయి. కొందరేమో ప్రభాస్‌కు తీవ్ర అనారోగ్యం అని రాశారు. ఇంకొంత మంది మాత్రం బెడ్డు మీద లేవలేనట్టు వంటి స్థితి అని రాశారు. మరి కొందరు నార్మర్ ఫీవర్ అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ప్రభాస్ ఆరోగ్యం మీద రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్ ఓ చిన్న సినిమా ప్రమోషన్ కోసం బయటకు వచ్చాడు. సాచి అనే చిత్రం కోసం ప్రభాస్ ముందుకు వచ్చాడు. ఆ ఈవెంట్‌లో ప్రభాస్ సందడిగానే కనిపించాడు. అయితే ప్రభాస్ ఎంత కష్టపడి ఆ ప్రమోషన్‌కు వచ్చాడు.. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు అనేది తాజాగా బయటకు వచ్చింది. సాచి మేకర్లు తాజాగా ప్రభాస్ గొప్పదనం గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.


ప్రభాస్ ఇప్పుడు సలార్, మారుతి సినిమా, ప్రాజెక్ట్ కే, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే సాచి సినిమా కోసం వస్తానని చెప్పడం, అలా మాటివ్వడంతో ప్రభాస్ ఉదయం ఐదు గంటలకే వచ్చాడట. అప్పటికే లేట్ నైట్ షూటింగ్ జరిగిందట. సలార్ సినిమా సెట్ నుంచి ప్రభాస్ కాస్త సిక్ అయి వచ్చాడట. ఆ దుమ్ము అలా ఫైటింగ్ సీన్ చేసి వచ్చాడట. ఇచ్చిన మాట కోసం అలా ఉదయమే సాచి ప్రమోషన్స్ కోసం వచ్చాడట.


అయితే ప్రభాస్ ఇలా కంటిన్యూగా సినిమాలు చేయడం, లేట్ నైట్ షూటింగ్‌లు చేయడంతో ప్రభాస్ ఆరోగ్యం దెబ్బ తింటోందని తెలుస్తోంది. మరి ప్రభాస్ తన ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ద వహిస్తున్నాడా? లేదా? అని డార్లింగ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్‌, సలార్, మారుతి సినిమాలు విడుదలయ్యే చాన్స్ ఉంది.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook