Sad Year For Mahesh: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి!
Sad Year For Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబును వరుస విషాదాలు వెంటాడుతున్న క్రమంలో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
2022 Sad Year For Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబును వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకే ఏడాది తండ్రి తర్వాత తనకు బాసటగా నిలిచి తన కెరీర్ ఎదగడానికి కారణమైన తన సోదరుడు రమేష్ బాబు, తన తల్లి ఇందిరాదేవి, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను కోల్పోవడం అత్యంత బాధాకరం అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో జనవరి నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో మొదటి విషాదం చోటుచేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందారు.
ఆయన మరణించడానికి కొన్ని రోజులు ముందు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్య పరిస్థితి నేపథ్యంలో హాస్పిటల్ కి తరలించేందుకు కుటుంబ సభ్యులు సమాయత్తమవుతూ ఉండగా ఆయన తుది శ్వాస విడిచారు. అప్పట్లో గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్కు తీసుకు వెళ్లిన తరువాత ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు సామ్రాట్ మూవీతో హీరోగా పరిచయమై తర్వాత తనకు నటన కలిసి రాదనుకొని నిర్మాతగా మారారు.
తెలుగుతో పాటు పలు హిందీ సినిమాలు కూడా నిర్మించారు. హిందీలో సూర్యవంశం తెలుగులో అర్జున్, అతిధి, దూకుడు వంటి సినిమాలు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత. సెప్టెంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూశారు. ఆవిడ మరణించడానికి కొన్ని రోజులు ముందు నుంచి అనారోగ్యంతో బాధపడ్డారు. వృద్దాప్యం రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె కన్నుమూశారు.
అప్పుడే మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణించిన సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడం మహేష్ కు కోలుకోలేని దెబ్బ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఒకే ఏడాది సోదరుడిని తల్లిని తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేనిది అని మహేష్ బాబుకు బలం చేకూర్చాలని తామంతా దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆయన అభిమానులు అందరూ పేర్కొంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు అభిమానులు కాని వారు కూడా మహేష్ పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ఒకే ఏడాది తల్లి తండ్రి సోదరుడిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోగలరని వారంతా కామెంట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండే మీం పేజెస్ సైతం సూపర్ స్టార్ కృష్ణ మరణానికి సంతాప సూచకంగా ఈరోజు ఎలాంటి మీమ్స్ చేయమని ప్రకటించడం కూడా ఆయనకున్న మీదున్న గౌరవాన్ని సూచిస్తోంది.
Also Read: Krishna Last Movie: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమ ఏమిటో తెలుసా?
Also Read: Super Star Krishna: కృష్ణకు సూపర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook