Super Star Krishna Passed Away: కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ట గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఆయన నాలుగు గంటల సమయంలో కన్నుమూసినట్లు కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. గత గొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. కృష్ణను రక్షించేందుకు వైద్యులు చివరివరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
ఏడాదికి పది సినిమాల చొప్పున దాదాపు 350 సినిమాల్లోపైకి కృష్ణ నటించారు. ఆయనకు సూపర్ స్టార్ బిరుదు సూపర్‌గా సెట్ అయిందని చెప్పొచ్చు. అయితే సూపర్‌స్టార్ కంటే ముందు ఆయనను కౌబాయ్, నటశేఖర అనే పిలిచేవారు. అయితే సూపర్ స్టార్ బిరుదు కోసం కృష్ణకు గట్టిపోటీనే ఎదురైంది. శివరంజని అనే వారపత్రిక టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు అని ఓటింగ్ నిర్వహించింది.
ఈ ఓటింగ్‌లో కృష్ణకు తిరుగులేని మెజార్టీ రావడంతో సూపర్ స్టార్ బిరుదు సొంతం అయింది. అంతకంటే ముందు జ్యోతీ చిత్ర అనే సినీ వారపత్రిక కూడా ఈ బిరుదు కోసం పోటీ నిర్వహించింది. కృష్ణతోపాటు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు ఇలా చాలా మంది పోటీ పడగా మొదటిసారి ఎన్టీఆర్‌కు మెజార్టీ వచ్చింది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తరువాత మరోసారి సూపర్ స్టార్ బిరుదు కోసం జ్యోతీ చిత్ర పోటీ నిర్వహించింది. అప్పుడు ఇతర హీరోల కంటే కృష్ణకు బంపర్ మెజార్టీ రావడంతో బిరుదు సొంతమైంది. 1980 దశకంలో కృష్ణకు భారీ మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన ఏడాదికి 12 నుంచి 14 సినిమాల రిలీజ్ చేసేవారు. దీంతో ఇలా కృష్ణకు సూపర్ స్టార్ బిరుదును సెట్ అయిపోయింది. ఇక ఆ తరువాత ఏ పత్రిక కూడా పోటీ నిర్వహించలేదు. నటనలో ఎప్పటికీ స్టార్‌గా.. అభిమానుల గుండెల్లో ఎవర్ గ్రీన్‌గా.. టాలీవుడ్ చరిత్రలో సూపర్‌స్టార్‌గా ఆయన నిలిచిపోతారు. కృష్ణ తనయుడు మహేష్ బాబును ప్రస్తుతం అందరూ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు.
Also Read: Krishna Passed Away: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం!
Also Read: మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. మా చేతుల్లో ఏమీ లేదు.. డాక్టర్స్ కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook