యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాహో’.. సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ తో ఫాన్స్ లో ఫుల్ జోష్ నింపాలని భావించిన మేకర్స్ ఈ మేరకు సోమవారం రిలీజ్ చేశారు.


కాగా ఐదేళ్ల తర్వాత తమ అభిమాన హీరో స్టైలిష్‌ లుక్కులో కనిపించటంతో డార్లింగ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే... పోస్టర్‌ పై కామెంట్లు చేస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.