Virupaksha 3 Days Collections మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గోల్డెన్‌ లెగ్ అంటూ పేరు దక్కించుకున్న లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించింది. సుకుమార్‌ శిష్యుడు అయిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సుకుమార్‌ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సుకుమార్‌ రచన సహకారం అందించాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ మేకర్స్‌ చేసిన ప్రచారం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరూపాక్ష చిత్రానికి పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మొదటి రోజు ఈ సినిమాకు డీసెంట్‌ ఓపెనింగ్స్ లభించాయి. ఇక రెండవ రోజు వీకెండ్‌ అవ్వడంతో పాటు రంజాన్‌ పండుగ అవ్వడం వల్ల భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక మూడవ రోజు ఆదివారం కూడా మొదటి రోజు రోజులతో పోల్చితే భారీగానే నమోదు అయ్యాయి. సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ లోనే అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ ను విరూపాక్ష చిత్రం రాబట్టింది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


విరూపాక్ష చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.79 కోట్ల షేర్‌ ను రాబట్టింది. రెండవ రోజు రూ.5.8 కోట్ల షేర్‌ ను దక్కించుకోగా మూడవ రోజు రూ.5.77 కోట్లు రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 16.36 కోట్ల రూపాయలను షేర్‌ గా రాబట్టినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో కూడా భారీగానే ఈ సినిమా వసూళ్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.19.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పరిస్థితి చూస్తూ ఉంటే మరో రెండు మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ


వీకెండ్‌ వరకు బాగానే వసూళ్లు రాబట్టిన విరూపాక్ష.. వీక్ డేస్ లో ఎలా వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి. నేటి నుండి ఈ సినిమాకు అసలైన పరీక్ష. వీక్‌ డేస్ అయిన నేటి నుండి రోజుకు కనీసం కోటి రూపాయల షేర్‌ ను దక్కించుకున్నా గొప్ప విషయమే. సమ్మర్‌ హాలీడేస్ అవ్వడంతో విరూపాక్ష ఈజీగా కోటికి మించి వీక్ డేస్ లో కూడా షేర్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు ముందు సాయి ధరమ్‌ తేజ్ కమర్షియల్‌ సక్సెస్ దక్కించుకుని చాలా కాలం అయ్యింది. యాక్సిడెంట్‌ అయ్యి ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డ సాయి ధరమ్‌ తేజ్ అనూహ్యంగా ఈ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విరూపాక్ష హిట్‌ అవ్వడంతో సాయి ధరమ్‌ తేజ్ , సంయుక్త మీనన్ లు మరింత బిజీ అవ్వడంతో పాటు భారీగా రెమ్యూనరేషన్‌ పెంచే అవకాశాలు ఉన్నాయి.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook