Sai Pallavi Latest Pics లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవిని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ను చేశారు జనాలు. ఆమె సినిమాల్లో కనిపించే తీరు ఒకెత్తు అయితే.. బయట కనిపించే తీరు ఇంకో ఎత్తు. ఆమెకు స్క్రీన్ మీద చూడాలని అనుకునే అభిమానుల కంటే.. బయట ఇలా చక్కని సంప్రదాయమైన చీరకట్టులో చూడాలని అనుకునే అభిమానులే ఎక్కువ. సాయి పల్లవికి సినిమాల పరంగా కంటే వ్యక్తిగతంగా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే సాయి పల్లవి సినిమా అంటే జనాలు.. ఆమెను మాత్రమే చూసేందుకు వస్తారు. మన దర్శక నిర్మాతలు సైతం ఆమెకు అలాంటి పాత్రలే ఇస్తుంటారు. ఫిదా, లవ్ స్టోరీలు ఆ కోవలో తెరకెక్కినవే. ఇక గత ఏడాది వచ్చిన విరాట పర్వం సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. కానీ సాయి పల్లవి మాత్రం వందకు వంద శాతం తన నటన, ఆహార్యంతో అందరినీ మెప్పించింది. సాయి పల్లవి తప్పా ఇంకో ఫ్యాక్టర్ అందులో లేదనిపించేంతగా నటించేసింది.


 



ఆ తరువాత గార్గి సినిమాతో తన నటనాశక్తిని మరోసారి నిరూపించింది. ఇలా సాయి పల్లవికి గత ఏడాది ఒకటి కలిసి వచ్చింది. ఇంకోటి పోయింది. కానీ విరాటపర్వం సమయంలో మాట్లాడిన మాటలే ఆమెను వివాదాల్లోకి నెట్టేశాయి. హింస ఎక్కడ జరిగినా హింసే అని, తాను ఓ డాక్టర్‌ని అవ్వడంతో తనకు ప్రాణం విలువ తెలుసు అని సాయి పల్లవి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. 


ఇక అలా కాంట్రవర్సీలు ఎక్కువ అవుతున్నాయనో ఏమో గానీ సాయి పల్లవి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. జనవరి 1న గుడిలో ధ్యానం చేస్తూ కనిపించిన ఫోటోలో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఇలా ఆమె స్వయంగా ఫోటోను షేర్ చేసింది. నవ్వడం, హోప్ ఉండటం, గ్రాటిట్యూడ్ చూపిస్తే చాలు ఈ జీవితానికి అన్నట్టుగా పోస్ట్ చేసింది.


Also Read:  Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!


Also Read: Rajinikanth Called : వీర సింహారెడ్డి డైరెక్టర్ కు రజనీకాంత్ ఫోన్.. గాల్లో తేలిపోతున్నాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook