Sai Pallavi Secretly Watched Sarkaru Vaari Paata movie in PVR RK Cineplex: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు మోస్ట్‌ అవెటెడ్‌ సినిమా 'సర్కారు వారి పాట' గత గురువారం (మే 12) విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో.. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోదాదాపుగా అన్ని థియేటర్ల వద్ద హౌస్‌ ఫుల్‌ బోర్డులు పడ్డాయి. రెండున్నర ఏళ్ల తర్వాత మహేశ్‌ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. సినీప్రియులు అందరూ థియేటర్‌కు బారులు తీరుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు సినీ ప్రముఖులు థియేటర్‌కు వెళుతున్నారు. తాజాగా నేచురల్‌ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ముసుగేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లారు. శనివారం హైదరాబాద్ నగరంలోని పీవీఆర్‌ ఆర్‌కే సినీప్లెక్స్‌లో ఎస్‌వీపీ సినిమా చూసి ఎంజాయ్‌ చేశారు. అయితే తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, స్కార్ఫ్‌తో థియేటర్‌కు వెళ్లారు. సినిమా చూశాక కూడా ముఖానికి మాస్క్‌ ధరించి.. ఎవరికీ కనబడకుండా ఫోన్‌లో మాట్లాడుతూ వడివడిగా నడుచుకుంటూ థియేటర్‌ నుంచి బయటకు వెళ్లారు. 



'సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు సీక్రెట్‌గా వెళ్లిన సాయి పల్లవికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఇక మహేష్ అభిమానులు సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. రానా దగ్గుబాటి సరసన నటించిన 'విరాట పర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 


Also Read: Ambati Retirement: రాయుడు వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిది.. అంతా బానే ఉంది: చెన్నై కోచ్‌


Also Read: Malavika Mohanan Photos: డోసు పెంచేసిన 'మాస్టర్' బ్యూటీ.. పొట్టి బట్టల్లో అందాల ఆరబోత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.