Salaar: సలార్ అసలు కథని సెకండ్ పార్ట్ కి వదిలేసిన ప్రశాంత్ నీల్…ట్విస్ట్ ఇదే
Salaar Pre-Booking: ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. కాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్ర యూనిట్ తో చేసిన ఇంటర్వ్యూ ఈరోజు విడుదల అయింది..
Salaar Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా వస్తున్న సలార్ సినిమా మొదటి పార్ట్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం మొదటి భాగం అలానే రెండో భాగం గురించి ప్రస్తుతం ఒక కథనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారం సలార్ 1లో చూపించేది దేవా, రాజమన్నార్ ల కథ. వారి చిన్నప్పటి కథ అలానే ఆ తరువాత పెద్దయ్యాక రాజమన్నార్ కి వచ్చే సమస్యలు. అయితే అసలు సిసలైన క్యారెక్టర్ ఈ చిత్రంలో దేవాది కాదని.. దేవా తండ్రి అలియాస్ సలార్ ది అని తెలుస్తోంది.
కాగా ఎంతో ముఖ్యమైన ఈ సలార్ క్యారెక్టర్ రెండో భాగంలో వస్తాడని వినికిడి. సలార్ మొదటి భాగం ప్రీ క్లైమాక్స్ లో ఆ పాత్రని ఎంట్రీ ఇప్పించి ఒక్కసారిగా హైప్ ని సీక్వెల్ వైపు మళ్లించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా రెండో భాగంలో సలార్ పాత్రతో పాటు జగపతి బాబు పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ వార్తల గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ విషయం గురించి లీకులైతే సీని వర్గాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతే కాదు కొంతమంది ఫస్ట్ లుక్ పోస్టర్ లో కొనదేరిన మీసాలతో చూపించిన గెటప్ అసలు సలార్ దని, ఇప్పుడు చూస్తున్న ప్రభాస్ కొడుకు క్యారెక్టరని అంటున్నారు.
మొత్తం పైన ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చెయ్యబోతున్నారు అని.. ట్విస్ట్ అదే అని.. అంతేకాకుండా అసలు పవర్ఫుల్ కథని మొత్తం ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లోనే ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు ఏమిటో తెలియాలి అంతే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. కాగా సలార్ మొదటి భాగం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రానికి పోటీగా షారుక్ ఖాన్ డంకీ కూడా విడుదలవుతోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం ప్రభాస్ మ షారుఖ్ ఖాన్ ని డామినేట్ చేసేలా కనిపిస్తున్నారు.
ఇక ఈ చిత్రం ఎలాగైనా వెయ్యికోట్ల గ్రాస్ సంపాదిస్తుందని.. ఒకవేళ బ్లాక్ బస్టర్ తాక వస్తే ఏకంగా 1200 కోట్ల గ్రాస్ క్రాస్ అవ్వడం ఖాయమని వినిపిస్తోంది. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook