Salaar : టాలీవుడ్ కి మరో రమ్యకృష్ణ.. శ్రియా రెడ్డికి ఫ్యాన్స్ ఫిదా
Salaar box-office: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం సలార్ సినిమా గురించే నిండిపోయి ఉంది. అన్ని భాషలవారు ఈ చిత్రాన్ని చూసి జేజేలు పలుకుతున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి సమానంగా పేరు తెచ్చుకున్న వారిలో శ్రియా రెడ్డి కూడా ఒకరు..
Prabhas Salaar: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో కనిపించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు. ఇందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో ఏ పాత్ర కూడా ప్రశాంత్ నీల్ అనవసరంగా పెట్టకపోవడం. ఆఖరికి అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఈ చిత్రానికి అవసరమా అని ట్రైలర్ లో అనిపించిన.. సినిమాలో మాత్రం కథని డ్రైవ్ చేసే క్యారెక్టర్ లోనే శృతిహాసన్ ని పెట్టారు ప్రశాంత్ నీల్. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ కన్నా కూడా ఎక్కువ మార్కులు సంపాదించింది మాత్రం శ్రియా రెడ్డి.
సలాడ్ సినిమా మొదటి భాగం చూస్తే తప్పకుండా రెండో భాగం మొత్తం శ్రియా రెడ్డికి చాలా ప్రధానమైన పాత్ర ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ చిత్రంలో ముఖ్యమైన విలన్ గా ఈమె కనిపించింది. అయితే శ్రియ రెడ్డి గురించి సౌత్ వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటె ఇంతకుముందే విశాల్ పొగరు సినిమాతో తాను నెగిటివ్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో చెయ్యగలదో రుజువు చేసుకుంది.
అయితే ఆ తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన శ్రియా రెడ్డి ఇప్పుడు మళ్ళీ సలార్ సినిమాలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ చిత్రం చూసిన వారంతా శ్రియా రెడ్డిని చూస్తే నరసింహాలో రమ్యకృష్ణ.. అలానే బాహుబలిలో రమ్యకృష్ణ గుర్తొస్తోంది అంటున్నారు. హీరోయిన్స్ లో నెగిటివ్ క్యారెక్టర్లు చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనూ రమ్యకృష్ణ లాగా విలనిజం అయిన హుందాతనమైన ఒక రేంజ్ లో పండించగలిగే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ తరువాత ఆ రేంజ్ నటి శ్రియ రెడ్డి అని నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు.
ఇక రమ్యకృష్ణ డేట్స్ దొరకని వాళ్ళు తమ సినిమాలలో శ్రియా రెడ్డిని తీసుకోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక శ్రియ రెడ్డి తెలుగులో హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాలలో కనిపించారు. 2003లో అప్పుడప్పుడు అనే సినిమాలో .. 2005లో అమ్మ చెప్పింది సినిమాలో నటించి మెప్పించారు. మరి ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియా రెడ్డికి మన సౌత్ సైట్ ఎలాంటి ఆఫర్లు వస్తాయో వేచి చూడాలి.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook