Salaar World Television Premier: గతేడాది 'ఆదిపురుష్', సలార్ మూవీలతో పలకరించాడు ప్రభాస్. అందులో ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. మరోవైపు 2023 యేడాది చివర్లో విడుదలైన 'సలార్' మూవీతో ప్రభాస్‌ సాలిడ్ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్‌ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్డర దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏంటో తెలియజేసింది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున  నిర్మించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ,ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది. అటు హిందీలో కూడా అనుకున్నంత టాక్‌కు తగ్గ వసూళ్లు రాబట్టడంలో ఫెయిల్ అయింది. ప్రస్తుతం సలార్ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన సలార్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు థియేట్రికల్‌గా..ఓటీటీలో అలరించిన సలార్ మూవీ.. త్వరలో శాటిలైట్‌ ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ఈ నెల 21 ఏప్రిల్ సాయంత్రం 5.30 గంటలకు ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. మరి థియేట్రికల్‌గా ఓటీటీ వేదికగా అలరించిన 'సలార్' చిత్రం టీవీలో ఏ మేరకు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఈయన త్వరలో 'కల్కి 2898 AD' మూవీతో పలకరించబోతున్నారు. ఈ సినిమా మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో మహా భారత కాలం నుంచి రాబోయే 2898 AD వరకు ఆరువేల ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం దాదాపు 900 రోజుల పాటు వర్క్ చేసారు. రీసెంట్‌గా గుమ్మడికాయ కొట్టిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.


ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేయబోతన్నారు. ఇందులో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో పాటు 'సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం' షూటింగ్ ఒకేసారి జరగనున్నాయి. ఈ యేడాది సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ వచ్చే 2025 దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మరోవైపు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ ఉంది. ఈ యేడాదే ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అటు మంచు విష్ణు 'కన్నప్ప'లో మహా శివుడి వేషం వేస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ పార్ట్ ప్రభాస్ కంప్లీట్ చేయనున్నాడు. అటు హిందీలో సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ చేయనున్నాడు. మొత్తంగా సలార్ మూవీ తర్వాత తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.


Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..


Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter