Salman Khan`s Security: సల్మాన్ ఖాన్‌కి వై-ప్లస్ సెక్యురిటీ అందించిన సర్కారు.. ఎందుకంటే..
Salman Khan gets Y Plus Security: సల్మాన్ ఖాన్‌కి ముంబై పోలీసులు వై ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Salman Khan gets Y Plus Security: సల్మాన్ ఖాన్ , గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. సల్మాన్ ఖాన్ క్రిష్ణజింకలను వేటాడినప్పటి నుంచి లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తూ వస్తోంది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్యకు గురైన కొద్ది రోజులకే సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్‌లను చంపేస్తాం అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ముంబైలోని తమ ఇంటి ఆవరణలో సలీం ఖాన్ భద్రతా సిబ్బందికి ఈ బెదిరింపు లేఖ లభించింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖతో అప్రమత్తమైన సల్మాన్ ఖాన్ స్వీయ రక్షణ కోసం గన్ లైసెన్స్ కావాలని ముంబై పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపు లేఖను కూడా తన దరఖాస్తుతో జర పరిచినట్టు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ బలాన్ని ప్రదర్శించుకునేందుకే సల్మాన్ ఖాన్, సలీం ఖాన్ లను టార్గెట్ చేస్తున్నట్టు మహారాష్ట్ర హోంశాఖ వెల్లడించింది.
ఇంతకీ వై ప్లస్ కేటగిరీ సెక్యురిటీ అంటే ఏంటి ?
సల్మాన్ ఖాన్ కి వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడం సరే కానీ ఇంతకీ వై ప్లస్ కేటగిరీ సెక్యురిటీ అంటే ఏంటి అనేదే చాలా మందికి కలిగే కామన్ డౌట్. వై ప్లస్ కేటగిరి సెక్యురిటీ కవర్ కింద ఎలాంటి రక్షణ కల్పిస్తారంటే.. రక్షణ కోరుకున్న వ్యక్తి ఇంటి వద్ద ఒక సీఆర్పీఎఫ్ కమాండర్, నలుగురు కానిస్టేబుల్స్‌ని నియమిస్తారు. మరో ఆరుగురు పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్స్‌ని మూడు షిఫ్టుల్లో రొటేషనల్ పద్ధతిలో నియమిస్తారు. అంటే ఎవరికైతే రక్షణ కల్పిస్తున్నారో.. వారి వెంటే ఎల్లవేళలా ఇద్దరు పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్లు ఉంటారన్నమాట. బాలీవుడ్‌లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌కి వై ప్లస్ కేటగిరి సెక్యురిటీ ( Salman Khan ) ఇస్తుండగా మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ , సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్‌లకు ఎక్స్ - ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు.
Also Read : Mukesh Ambani’s security: ముఖేష్ అంబానికి Z ప్లస్ కేటగిరి భద్రత
Also Read : Stop Line Violations: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
Also Read : Revanth Reddy: మునుగోడును దత్తత తీసుకుంటా.. కేటీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి