Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు డెంగ్యూ.. బిగ్‌ బాస్‌ షోకు హోస్ట్‌గా కరణ్ జోహర్

Salman Khan Dengue: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొద్ది వారాలపాటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌కు దూరం కానున్నారు. అతని స్థానంలో కరణ్ జోహార్‌ హోస్ట్‌గా రానున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 10:48 AM IST
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు డెంగ్యూ.. బిగ్‌ బాస్‌ షోకు హోస్ట్‌గా కరణ్ జోహర్

Salman Khan Dengue: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రియాల్టీ షో బిగ్ బాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అతను డెంగ్యూ బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్‌ 16 హోస్టింగ్‌కు కూడా కొంత విరామ ప్రకటించారు. కండల వీరుడు డెంగ్యూ బారిన విషయం తెలియడంతో త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. 

దీంతో బిగ్ బాస్ షోకు కొత్త హోస్ట్‌ను తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ స్థానంలో కరణ్‌ జోహార్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తారని వస్తారని ప్రచారం జరుగుతోంది. 'బిగ్ బాస్ 16'కి హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ స్వయంగా కరణ్ జోహార్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. కరణ్ గతంలో 'బిగ్ బాస్ OTT'ని హోస్ట్ చేశాడు. 

మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కనిపించరు. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీ షూటింగ్‌కు కూడా దూరంగా ఉండనున్నారు. 

సల్మాన్ స్వయంగా కరణ్‌కి ఫోన్ చేసి షో హోస్ట్ చేయమని కోరారని సమాచారం. సల్మాన్‌పై ఉన్న గౌరవంతో మాట కాదనలేక కరణ్ అంగీకరించారట. గతంలో కరణ్‌ జోహర్ 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో సైడ్ రోల్‌లో నటించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే సల్మాన్ ఆ పాత్రకు అంగీకరించి నటించారు.

ఇక ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలరించారు సల్మాన్ ఖాన్‌. డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో అందరినీ అలరించారు. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఈ క్యారెక్టర్‌ను తెలుగులో స‌ల్మాన్ ఖాన్ చేశారు. చిరంజీవితో కలిసి స‌ల్మాన్ చేసిన యాక్ష‌న్ సీక్వెన్సులు అభిమానులకు తెగ నచ్చేశాయి.
 

Also Read: Dhanteras Special: ధన్‌తేరస్‌ రోజున చీపుర్లు కొనాలా..? ఇవి కొనుగోలు చేస్తే మీకు లాభమే..!

Also Read: Roja Selvamani Marriage pic : రోజా పెళ్లి ఫోటో వైరల్.. నాడు నేడు.. సెల్వమణి బర్త్ డే స్పెషల్ పిక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News