సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు... సంచలన రేపుతోన్న ఆ వ్యక్తి ఆరోపణలు..
Salman Khan neibhbour sensational allegations : కేతన్ కక్కడ్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ సల్మాన్ ఖాన్ ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రాగా.. సల్మాన్ తరుపు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపించారు.
Salman Khan neibhbour sensational allegations : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని ఆరోపించాడు. అంతేకాదు, సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా చేశాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతన్ కక్కడ్ ఈ ఆరోపణలు చేయగా... సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.
అసలేంటీ వివాదం :
సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పన్వేల్‌లో ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ పక్కనే కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. ఈ ఇద్దరికీ ఎక్కడ చెడిందో తెలియదు కానీ కేతన్ కక్కడ్ అనే వ్యక్తి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఫాంహౌస్ పక్కన మరింత భూమిని కొనుగోలు చేయాలనుకున్న కేతన్ కక్కడ్... అది కుదరకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేశాడని చెబుతున్నారు.
నా తల్లి ఒక హిందువు : సల్మాన్ ఖాన్
కేతన్ కక్కడ్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ సల్మాన్ ఖాన్ ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రాగా.. సల్మాన్ తరుపు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపించారు. ఈ వివాదంలోకి కేతన్ కక్కడ్ అనవసరంగా సల్మాన్ మతాన్ని లాగాడని ప్రదీప్ గాంధీ పేర్కొన్నారు. సల్మాన్‌పై చిన్నపిల్లల అక్రమ రవాణాతో పాటు అతని ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని ఆరోపించాడన్నారు.
'కేతన్ కక్కడ్ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు... కేవలం నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేశాడు. ఆస్తి వివాదంలోకి నా వ్యక్తిగత ప్రతిష్ఠను ఎందుకు లాగుతున్నట్లు.. ఇందులోకి నా మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నట్లు... నా తల్లి ఒక హిందువు, నా తండ్రి ముస్లిం.. నా సోదరులు హిందూ అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. మేము అన్ని పండగలు జరుపుకుంటాం.' అని సల్మాన్ ఖాన్ తన లాయర్ ద్వారా కోర్టుకు విన్నవించారు.
కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోను తొలగించండి : సల్మాన్
కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని సల్మాన్ ఖాన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సల్మాన్ (Bollywood News) పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు కేతన్ కక్కడ్ తరుపు న్యాయవాది గడువు కోరడంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read: Horoscope Today January 23 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ కాలం, అప్రమత్తంగా ఉండాలి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook