Salman Khan refuses Rs. 20 crores Remuneration for Chiranjeevi's Godfather Movie: టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసిన చిరు.. గాడ్‌ ఫాదర్, బోళా శంకర్ సినిమాలు చేస్తూనే బాబీ, వెంకీ కుడుముల సినిమాలను లైన్‌లో పెట్టారు. మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్‌' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న గాడ్‌ ఫాదర్ చిత్ర షూటింగ్‌లో ప్రస్తుతం చిరు ఉన్నారు. ముంబై మహా నగరంలో గాడ్‌ ఫాదర్ షూటింగ్ జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్‌ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా ముంబైలోని సెట్స్‌లో సల్మాన్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్‌తో పాటు చిరంజీవి కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సెట్స్‌లో సల్మాన్‌కి బొకే ఇస్తున్న ఫొటోను చిరు ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాలో సల్మాన్ నటించడానికి ఒప్పుకునే ముందు చిరుకి ఓ సరదా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


గాడ్‌ ఫాదర్‌లోని అతిథి పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌కు చిత్ర నిర్మాతలు 15-20 కోట్లు ఆఫర్ చేశారట. అయితే తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోనని సల్మాన్ తేల్చి చెప్పాడట. తనకు బలవంతంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని చూస్తే.. షూటింగ్ నుంచి వెళ్లిపోతానని మెగాస్టార్ చిరంజీవికి ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. 'నా సినిమాలో ఓ పాత్ర చేయమని నేను మిమ్మల్ని అడిగితే.. అందుకు మీరు రెమ్యునరేషన్ తీసుకుంటారా?' అని చిరుని కండల వీరుడు ప్రశ్నించాడట. ఆ ప్రశ్నకు చిరు కన్విన్స్ అయ్యాడని తెలుస్తోంది. గాడ్‌ ఫాదర్‌లో సల్మాన్ పాత్ర నిడివి 20 నిమిషాల పాటు ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నాడట. 



సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ను చూసుకుంటే.. ఆయన గెస్ట్ రోల్ చేసినా కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. కానీ మెగాస్టార్‌ చిరంజీవితో ఉన్న స్నేహబంధం కారణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గాడ్‌ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'జంజీర్' షూటింగ్ ముంబైలో జరిగినప్పుడు సల్మాన్ ప్రతిరోజూ సెట్‌కి భోజనం తీసుకెళ్లేవాడట. ఇక కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా గాడ్‌ ఫాదర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.


Also Read: Gambhir-Dhoni: 138 కోట్ల భారతీయ ప్రజల ముందు.. ఎంఎస్ ధోనీ గురించి ఆ మాట చెప్పగలను: గంభీర్‌


Also Read: Jhulan Goswami: డబుల్ సెంచరీ కొట్టిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook