Jhulan Goswami becomes First bowler in Women's Cricket to play 200 ODIs: ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఇప్పటికే ఉమెన్స్ క్రికెట్లో వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచిన గోస్వామి.. తాజాగా 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసిన మొదటి మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాగానే.. 39 ఏళ్ల సీనియర్ పేసర్ గోస్వామి 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు.
ఝులన్ గోస్వామి నేడు 200వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఉమెన్స్ క్రికెట్లో ఏ బౌలర్ కూడా 200 వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. ఇక 200 వన్డేలు ఆడిన రెండో మహిళా క్రికెటర్‌గా గోస్వామి నిలిచారు. అంతకంటే ముందు ఈ ఘనత టీమిండియా లెజెండరీ బ్యాటర్, కెప్టెన్ మిథాలీ రాజ్ అందుకున్నారు. మిథాలీ నేడు 230 వ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీ కూడా బాదారు. ఇది ఆమె కెరీర్లో 63వ అర్ధ సెంచరీ.
200వ వన్డే మ్యాచులు ఆడిన మహిళా ప్లేయర్ ఇద్దరు టీమిండియా వారే కావడం విశేషం. మిథాలీ రాజ్ (230), ఝులన్ గోస్వామి (200) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ (191), దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నాన్ డు ప్రీజ్ (150), ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ అలెక్స్ బ్లాక్వెల్ (144), ఇంగ్లండ్ పేసర్ జెన్నీ గన్ (144) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. షార్లెట్ ఎడ్వర్డ్స్ ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలకడంతో 200 మార్క్ చేరుకోవడానికి దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు చాలా కాలమే పట్టొచ్చు.
𝗔 𝗗𝗼𝘂𝗯𝗹𝗲 𝗧𝗼𝗻 𝗧𝗼 𝗖𝗵𝗲𝗿𝗶𝘀𝗵! 🙌 🙌
Congratulations to the legendary #TeamIndia pacer @JhulanG10 as she plays her 2⃣0⃣0⃣th WODI! 👏 👏 #CWC22 | #INDvAUS pic.twitter.com/jQvP25FwoX
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
మరోవైపు పురుషుల, మహిళలను కలిపి చూసుకుంటే.. వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏడో భారత బౌలర్‌గా ఘులన్ గోస్వామి ఇప్పటికే రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. గోస్వామి కంటే ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253) ఈ రికార్డును అందుకున్నారు. ఈ మెగా టోర్నీలో గోస్వామి ఓ రికార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (41) తీసిన బౌలర్‌గా గోస్వామి చరిత్ర సృష్టించారు.
Also Read: Today Horoscope March 19 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook