బిగ్ బాస్ అసంతృప్తి
`కరోనా వైరస్`.. కాటేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి.
'కరోనా వైరస్'.. కాటేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న రోగులు, వారి కుటుంబ సభ్యులను పోలీసులు బలవంతంగా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో వైద్యసిబ్బంది, పోలీసులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి.
ఇలాంటి ఘటనలపై బాలీవుడ్ బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పన్వెల్ లోన ఫామ్ హౌస్ లో రెండు రోజుల హాలీడే కోసం వెళ్లారు. కానీ కరోనా వైరస్ అందరికీ చాలా రోజులు హాలీడేస్ ఇచ్చిందని అన్నారు సల్లూభాయ్. ఐతే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, జనం ఇళ్ల నుంచి బయటకు రావడం, పోలీసులు, వైద్య సిబ్బందిపై రాళ్ల దాడికి దిగడం తనకు నచ్చడం లేదని ఆయన చెప్పారు. 10 నిముషాల నిడివి ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
ఏ రోగమైనా వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడం బాధాకరమని తెలిపారు సల్మాన్ ఖాన్. ఐతే మందు లేని కరోనా వైరస్ రోగ నిర్ధారణ అయితే మరింత బాధాకరంగా ఉంటుందని చెప్పారు. అలాగే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిని అర్థం చేసుకోకపోవడం అమానవీయం అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..