73వ స్వాతంత్ర్య దినోత్సవ  ( 73rd Independence day ) వేళ బాలీవుడ్ అగ్ర నాయకుడి విషెస్ వైరల్ అవుతున్నాయి. సారే జహాసే అచ్ఛా అంటూ కొత్త ట్యూన్ లో పాడిన వైనం...పాడుతూనే జెండావందన చేసిన తీరు అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. సల్లూభాయ్ ఏం చేసినా లేటెస్ట్ గానే ఉంటుందని అభిమానులు పొంగిపోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశమంతా 73వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి ( Corona pandemic )నేపధ్యంలో ఆంక్షల నడుమే పంద్రాగస్టు వేడుక ( August 15 celebrations ) లు జరుగుతున్నాయి. అందరూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా విషెస్ పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ( Salman khan ) అలియాస్ సల్లూభాయ్ వీడియో ఇప్పుడ వైరల్ గా మారింది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్బంగా సాహే జహాసే అచ్ఛా ( Sare jahan se acha ) అంటూ సల్మాన్ ఆ దేశభక్తి గీతాన్ని సరికొత్త ట్యూన్ లో కొత్తరీతిలో పాడి విన్పించారు. ఈ వీడియోను ప్రముఖ నిర్మాత అగ్మిహోత్రి ట్విట్టర్ లో షేర్ చేయగానే వైరల్ అయిపోయింది. సల్లూభాయ్ సారే జహాసే అచ్ఛా అంటూ పాట పాడుతూ జెండావందనం చేశారు. సల్మాన్ పాట్ ఇప్పుడు వైరల్ అవడంతో అభిమానుల తెగ ఆనందపడిపోతున్నారు. సల్లూ ఏం చేసినా లేటెస్ట్ గానే వెరైటీగానే ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు. పాట ప్రారంభం నుంచి చివర్లో అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలపడం  వరకూ అంతా ఆసక్తికరంగా సాగింది. Also read: Niharika: నిహరిక నిశ్చితార్థం వీడియో షేర్ చేసిన నాగబాబు