Galaxy shield salman khan house video goes viral: సల్మాన్ ఖాన్ ను ఎట్టిపరిస్థితుల్లో వదిలేదని లేదని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కండల వీరుడు కాస్త భయం గుప్పిట్లో ఉంటున్నట్లు తెలుస్తొంది. ఎక్కడికివెళ్లిన ప్రైవేటే సెక్యురిటీతోనే బైటకు వెళ్లున్నాడంట. అంతే కాకుండా.. ఇటీవల బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్స్ సైతం కొనుగోలు చేశాడంట. ఆపద ఎప్పుడు ఎక్కడినుంచి వస్తుందో అని కండల వీరుడు తెగ టెన్షన్ పడిపోతున్నాడంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ముంబైలోకి ఉన్న తన ఇంటికి కూడా బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేయించాడంట. ఎప్పుడు ఎక్కడి నుంచి ఆపద వస్తుందో అని.. సల్మాన్ మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారంట. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేయడం మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు. మరోవైపు సల్లు భాయ్ హమ్ సాథ్ సాథ్ హై.. మూవీ తీసేందుకు రాజస్థాన్ కు వెళ్లారంట.


అక్కడ నల్లని జింకల్ని వేటాడని ప్రచారం జరుగుతుంది. అక్కడి బిష్ణోయ్ తెగ మాత్రం నల్లని జింకను తమ దేవుడిలా, తమ సంతానంలా భావిస్తారు. అలాంటి జింకను వేటాడినందుకు సల్మాన్ ను  వదిలే ప్రసక్తి లేదని కూడా ఇప్పటికే ఈ గ్యాంగ్ ప్రకటించింది.


Read more: Viral Video: అరె వావ్.. దాబా మీద కూర్చుని పతంగీ ఎగరేస్తున్న వానరం.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..


ఇప్పటికే పలు మార్లు సల్లు భాయ్ ను హత్య చేసేందుకు కుట్రలు, ఆయన ఇంటి దగ్గర కాల్పులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం సల్మాన్ తన ఇంటికి కూడా బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్  ను ఏర్పాటు చేయడం మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.