Monkey Flying a kite video Goes viral: సోషల్ మీడియా పుణ్యామా..అని ఎక్కడ ఎలాంటి ఘటన జరిగిన వెంటనే వైరల్ అయిపోతున్నాయి. చాలా మంది తన చేతిలో మొబైల్స్ లలో ఎక్కడైన ఫన్నీ ఘటనలు, వెరైటీగా ఉన్న ఘటనలు జరగ్గానే వెంటనే తమ ఫోన్ లలో రికార్డులు చేస్తుంటారు. ఇంకా సోషల్ మీడియాలో పొస్ట్ లు చేసి వైరల్ చేస్తుంటారు. అయితే.. ఇటీవల వైరల్ వీడియోలను చూసేందుకు నెటిజన్ లు సైతం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వానరం బంగ్లా మీద కూర్చుని పతంగీ ఎగరేస్తుంది. దూరం నుంచి కొంత మంది వానరం చేస్తున్న పనిని తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు తెలుస్తొంది.
India Is Not For Beginners 😂😂 Monkey Flying a Kite in Benaras 👏👏 pic.twitter.com/zTQekX6NKg
— Rosy (@rose_k01) January 6, 2025
అయితే.. ప్రస్తుతం సంక్రాంతి పండగ సందడి మొదలైంది. తెలుగు నాట దీన్ని పెద్ద పండగ అని పిలుస్తుంటారు. అయితే.. సంక్రాంతి నేపథ్యంలో.. చాలా మంది ఆడవాళ్లు తమ ఇళ్లలో పిండివంటలు చేసుకుని ముగ్గులు వేసుకుంటారు. ఇక యువత బంగ్లా మీదకు వెళ్లి పతంగీలు ఎగరవేస్తుంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వానరం మీరేనా... నాక్కుడ పతంగీ ఎగరవేయడం వచ్చని కూడా తన టాలెంట్ ను చూపించుకొవాలని భావించినట్లుంది. ఇంకేం కోతి పక్కన ఎగురుతున్న పతంగీని పట్టుకుంది. మాంజాతో.. పతంగీని తనవైపు లాక్కుని పట్టుకుని కాసేపు రచ్చ చేసింది.
అక్కడున్న వారు ..ఈ ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.అయితే.. ఇటీవల ఒక కోతి.. ఇంట్లో చపాతీలు చేయడం, గిన్నెలు కడగటం వంటి వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కోతి చిలిపి పనులు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter