Most popular Female Telugu film stars April 2023: సోషల్ మీడియాలో మీడియాలో జరుగుతున్న చర్చను ఆధారంగా చేసుకుని ఆర్నాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు టాప్ హీరోలు, టాప్ హీరోయిన్ల లిస్టు ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భాషా ప్రాతిపదికన ఏ ఏ భాషల హీరోలు టాప్ టెన్ లో ఉన్నారు? అని లిస్టు ప్రకటిస్తూ వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అది కాక పాన్ ఇండియాలో కూడా సపరేట్గా లిస్టు ప్రచురిస్తూ వస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలకు గాను మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు జాబితాలో పది మంది హీరోయిన్స్ తాను దక్కించుకున్నారు. వారిలో సమంత మొదటి స్థానం దక్కించుకుంది, చివరిగా శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత దారుణమైన డిజాస్టర్ అందుకుంది. అయినా సరే ఆమె మొదటి స్థానం ఆక్రమించింది.


Also Read: Salaar Release Date:సలార్ రిలీజ్ డేట్ టెన్షన్.. అసలు విషయం చెప్పేసిన టీం!


ఇక చివరిగా ఒక తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజుల్ అగర్వాల్ ఈ లిస్టులో రెండవ స్థానం దక్కించుకోగా నిశ్శబ్దం అనే సినిమాతో చాలా కాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుష్క మూడో స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇక పూర్తిగా బాలీవుడ్ సినిమాల మీద దృష్టి పెట్టిన రష్మిక మందన్న నాలుగవ స్థానం దక్కించుకోగా చాలా కాలం క్రితం లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి ఈ లిస్టులో ఐదవ స్థానం దక్కించుకుంది.


ఇక ఈ మధ్యనే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ ఆరవ స్థానం దక్కించుకోగా బాలీవుడ్ సినిమాలతో సందడి చేస్తున్న పూజా హెగ్డే ఏడవ స్థానం దక్కించుకుంది. తమన్నా భాటియా 8వ స్థానంతో సరిపెట్టుకుంటే ఈ మధ్య కాలంలోనే ఈ లిస్టులో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల తొమ్మిదవ స్థానం దక్కించుకుంది. ఇక వీరి తర్వాత పదవ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. నిజానికి ఈ లిస్టులో ఉన్న చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతానికి యాక్టివ్గా లేకపోయినా వారి వారి అభిమానుల కారణంగా ఇంకా లిస్టులో స్థానం సంపాదిస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. మరి రాబోతున్న కాలంలో ఈ లిస్టులో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయేమో చూడాల్సి ఉంది.


Also Read: Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook