Samantha: చైతూతో విడాకుల అనంతరం సామ్(Samantha) సినిమాల్లో వేగం పెంచింది. వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. తాజాగా ఓ హాలీవుడ్ సినిమా(Samanth Hollywood Movie)కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా సమంత ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతోందని సోషల్ మీడియా(Social Media)లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఆ సినిమాపై ఇన్ స్టా(Instagram) వేదికగా క్లారిటీ ఇచ్చింది సమంత. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Akhanda Pre Release: ఒకే వేదికపై బాలయ్య, అల్లు అర్జున్​- ఫ్యాన్స్​కు ఇక పండగే!


ప్రముఖ డైరెక్టర్‌ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ‘'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'’(Arrangements Of Love Movie)అనే హాలీవుడ్‌ చిత్రంలో సమంత నటించనుంది. ‘'ఓ బేబీ'’ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా వ్యవహారించనున్నారు. ఇందులో 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయి‌గా సామ్ కనిపించనుంది. సామ్ తన మొదటి గ్లోబల్ సినిమా(Samantha Global Movie) గురించి చెబుతూ.. ”''సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా.. నేను చివరిగా 2009లో ‘'ఏ మాయ చేశావే'’ సినిమా కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత, మళ్లీ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని ఫీల్ అయ్యాను. నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ సర్'' అని ఇన్‌స్టాలో కృతజ్ఞతలు తెలిపింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook