Samantha Divorced Naga Chaitanya to benefit him: అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ వివాహం చేసుకొని కొన్నాళ్లపాటు కాపురం కూడా చేసి విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడం, ప్రేమను పెద్దలు దృష్టికి తీసుకువెళ్లి పెళ్లిగా మార్చడం వరకు అందరికీ తెలిసిందే.  అయితే వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ వీరి విడాకులకు అనేక కారణాలు తెరమీదకు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఎందుకు విడిపోతున్నాం అనే విషయం వారి పర్సనల్ కాబట్టి వారు బయట పెట్ట పోవడంతో అనేక రకాల ప్రచారాలు తెరమీదకు రాగా సమంత అయితే వాటిని భరించలేక కోర్టు మెట్లు కూడా ఎక్కిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ పూర్తిస్థాయిలో సమంత తప్పే ఎక్కువగా ఉంది, ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, కాదు వేరే ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని ఇలా రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. ఈ విషయం మీద సమంత కోర్టుకు వెళ్లడంతో సమంత గురించి తప్పుడు ప్రచారాలు ఆపమని సోషల్ మీడియాకు కోర్టు నోటీసులు జారీ చేయడంతో కాస్త ఈ వ్యవహారం సద్దుమణిగింది. 


ఇదీ చదవండి: Pooja Hegde Dating: సల్మాన్ తో పూజా డేటింగ్.. అందుకే ఏమీ మాట్లాడడం లేదట!


అయితే ఇప్పుడు తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే సమంత, నాగచైతన్య మీద ప్రేమతోనే ఆయనకు విడాకులు ఇచ్చిందనే వాదన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అదేమిటి నిజంగా ప్రేమ ఉంటే ఆయనతోనే కలిసి ఉండాలి కానీ ఇలా విడాకులు తీసుకోవడం ఏమిటి అనే అనుమానం అందరికీ కలగవచ్చు. కానీ ఈ విషయం మీద కూడా ఒక కొత్త వాదన వినిపిస్తోంది. అదేంటంటే తనకు మయోసైటిస్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నాయనే విషయం సమంతకు ముందే తెలుసట.


ఈ వ్యాధుల కారణంతో పిల్లల పుట్టడంలో ఇబ్బందులు అవుతున్నాయి, ఎక్కువ సమయం తీసుకుంటుంది అనే ఉద్దేశంతో నాగచైతన్యను ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన జీవితం బాగుండాలని ఉద్దేశంతోనే ఇలా విడాకులు ఇచ్చిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇదే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.


ఇదీ చదవండి: Actress Prema: రెండో పెళ్లిపై ఓపెన్ అయిన హీరోయిన్.. చేసుకుంటా తప్పేముందంటూ!


నోట్: 
ఈ సమాచారం ఆన్లైన్లో పలు మాధ్యమాల ద్వారా సేకరించినది. ఈ వార్తను జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook