Actress Prema: రెండో పెళ్లిపై ఓపెన్ అయిన హీరోయిన్.. చేసుకుంటా తప్పేముందంటూ!

Actress Prema clarification on second marriage: నటి ప్రేమ దేవి సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు, తెలుగులో రాయలసీమ రామన్న చౌదరి, ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో కనిపించిన ఆమె రెండో పెళ్లి గురించి స్పందించింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 04:59 PM IST
Actress Prema: రెండో పెళ్లిపై ఓపెన్ అయిన హీరోయిన్.. చేసుకుంటా తప్పేముందంటూ!

Actress Prema clarification on Her second marriage: కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటి ప్రేమ దేవి సినిమాతో టాలీవుడ్ లో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ధర్మచక్రం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించి ఆమె మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. నిజానికి తెలుగులో ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా తెలుగమ్మాయిలా పక్కింటి అమ్మాయిలా ముద్ర వేసుకున్న ఈ భామ తెలుగులో మాత్రమే కాదు మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో రాయలసీమ రామన్న చౌదరి, ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో ఆమె నటించింది.

కానీ ప్రస్తుతానికి ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆమె తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ సహా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. నిజానికి ప్రేమకు క్యాన్సర్ వచ్చిందని, గత 14న ప్రచారం జరిగింది. అంతేకాదు ఆమె రెండో వివాహానికి కూడా సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు విషయాల మీద ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను భర్త నుంచి ఎందుకు విడిపోయాను అనే విషయం మీద ఆ ఎల్లారిటీ ఇస్తూ ఇబ్బంది పడుతూ కలిసి బతకడం కంటే విడిపోవడం బెటర్ అని తనకు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: Child Artist Neha Thota: 'విక్రమార్కుడు'లో రవితేజ కూతురిగా నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

ఇక విడాకుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన కుటుంబం తనకు సపోర్టుగా నిలవడం మరింత ధైర్యాన్ని ఇచ్చిందని అందుకే తన పేరెంట్స్ వస్తానని చెప్పినా వినకుండా తాను స్వయంగా కోర్టుకు హాజరై విడాకులు తెచ్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రెండో వివాహం గురించి ఆమె స్పందిస్తూ పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయం అని జీవితంలో మంచి మ్యారేజ్ లైఫ్ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు.

ఒకసారి ఇలాగే పెళ్లి చేసుకున్నాను కానీ ఏమైంది అంటూ తన విడాకుల గురించి ఆమె కామెంట్ చేశారు. ఇక తనకు 70 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అప్పుడు చేసుకుంటే తప్పు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు దొరికేది ఒకటే జీవితం అని ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె పేర్కొన్నారు. ఇక తనకు నచ్చినట్లే ఉండమని తన తల్లి కూడా చెబుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక అదే ఇంటర్వ్యూలో సౌందర్య మరణం గురించి కూడా ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇక సౌందర్య చనిపోయిన రోజు అసలు జీవితం అంటే ఇంతేనా అని అనిపించింది అని ఇంటికి వెళ్ళగానే సౌందర్య, ఆమె బ్రదర్ ఫొటోస్ పెట్టి ఉండగా వాళ్ల బాడీస్ ని మాత్రం బాక్సులో పెట్టి ఉంచారని ఆమె తల కనిపించలేదు, మొండెం మాత్రమే కనిపించిందని అక్కడ వాళ్ళ తల్లిని చూసి చలించి పోయాను అని చెప్పుకొచ్చింది.

ఇదీ చదవండి: SS Rajamouli Love Story: రమతో రాజమౌళి ప్రేమ..రెండో పెళ్లి.. అందుకే పిల్లలు కూడా వద్దనుకున్నారట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News