Samantha Remuneration: చైతూతో విడాకుల అనంతరం సమంత(Samantha) తన స్నేహితులతో కలిసి ఎక్కువగా పర్యటనలు చేస్తోంది. ఇదే క్రమంలో సినిమాల జోరు కూడా పెంచింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' మూవీ(Shakuntalam Movie) షూటింగ్‌ని పూర్తి చేసింది. ప్రస్తుతం  కోలీవుడ్(Kollywood)లో విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi)తో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఫ్యామిలీ మ్యాన్‌'(Family Man2 Web series) వెబ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంతకు బాలీవుడ్ లో కూడా బాగానే అవకాశాలు వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం సామ్ తన పారితోషికం(Remuneration) భారీగా పెంచిందనే వార్తలు నెట్టింట షికారు చేస్తున్నాయి. తదుపరి తాను చేయబోయే సినిమాలకు రూ.3 కోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మాములుగా అయితే సమంత ఒక్కో సినిమాకు రూ.3కోట్ల కంటే తక్కువే తీసుకునేదట. కానీ ప్రస్తుతం మాత్రం జీఎస్టీ కాకుండా రూ.3 కోట్లు ఇవ్వాలని కండీషన్‌ పెట్టినట్లు సమాచారం.


Also read: Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??


జోరు మీద ఉన్న పూజా హెగ్డే, రష్మిక కూడా రూ. 2.5 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటున్నారు. సమంత మాత్రం ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్‌ చేయడం నిర్మాతలకు కాస్త భారమైనప్పటికీ.. ఆమెకు  ఉన్న క్రేజ్ దృష్ట్యా అంతమొత్తం ఇవ్వడానికి వెనుకాడడంలేదట. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook