Samantha item song in Pushpa: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్
Samantha item song in Pushpa movie: దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ పాటను రికార్డ్ చేయగా ఈ నెల ఆఖర్లో అల్లు అర్జున్, సమంతలపై ఈ ఐటం సాంగ్ షూట్ (Pushpa movie item song) చేయనున్నట్టు తెలుస్తోంది.
Samantha item song in Pushpa movie: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్ అనే టైటిల్ చూడగానే చాలా మందికి వచ్చే సందేహం.. సమంత ఐటం సాంగ్‌కి ఒప్పుకుందా అనే కదా!! ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న సమంత ఇప్పటివరకు ఎన్నో భిన్నమైన పాత్రలకు సైన్ చేసింది. ఆ పాత్రలను ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అనేంత గొప్పగా ఆడియెన్స్‌ని మెప్పించింది. రంగస్థలం లాంటి కమెర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తోనే కాకుండా మనం, ఓ బేబి, మజిలి లాంటి చిత్రాలతోనూ సమంత ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది.
తన గ్లామర్‌తో, అభినయంతో ఆడియెన్స్‌ని కట్టిపడేస్తున్న సమంత పెళ్లికి ముందు కానీ లేదా పెళ్లి తర్వాత కానీ సైన్ చేయని పాత్రల్లో ఐటం గాళ్ ఒకటి. అయితే, తాజాగా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత (Samantha divorce) ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun in Pushpa) హీరోగా తెరకెక్కుతున్న పుష్ప - ది రైజ్ మూవీలో సమంత ఐటం సాంగ్ చేస్తోందని... సమంతతో రంగస్థలం సినిమా తెరకెక్కించి ఆమెను నటిగా మరో స్థాయికి తీసుకెళ్లిన పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ స్వయంగా అడగడంతో ఆమె కాదనకుండా ఒప్పుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ పాటను రికార్డ్ చేయగా ఈ నెల ఆఖర్లో అల్లు అర్జున్, సమంతలపై ఈ ఐటం సాంగ్ షూట్ (Pushpa movie item song) చేయనున్నట్టు తెలుస్తోంది.
Also read : Mahesh-Rajmouli Combo: సమంత 'దూకుడు'.. మహేష్-జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా సామ్..??
పలు హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తున్న సమంత.. అవి చేస్తూనే స్టార్ హీరోలు ఉన్న సినిమాలు కూడా చేస్తూ తనకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్‌ని అలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచిస్తోందట. అందుకే పుష్ప సినిమాలో సమంత ఐటం సాంగ్ (Pushpa movie latest updates) చేయడానికి అంగీకరించిందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also read : Cheating Case On Shilpa Shetty: ‘నా హక్కులను కాపాడండి’.. చీటింగ్ కేసుపై శిల్పాశెట్టి స్పందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook