Chaysam Divorce: సమంత- నాగచైత్యన్య (Samantha Naga Chaitanya) విడాకుల ముచ్చట ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. చై-సామ్ విడిపోయారంటే కొంత మంది అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 2 న ఇద్దరు మూడేళ్ల  వివాహ బంధానికి బై బై చెబుతూ... ఇద్దరం భార్య-భర్తలుగా కొనసాగలేమని వెల్లడించిన సంగతి తెలిసిందే. చూడముచ్చటగా ఉండే టాలీవుడ్ (Tollywood) లవ్ బడ్స్ అండ్ సూపర్ కపుల్ ఇంత తొందరగా విడిపోతారని అభిమానులు ఉంచించనేలేదు. 


Also Read: MAA Elections 2021: 'మా' సమరంలో మెగా బ్రదర్.. ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు


ఇదిలా ఉండగా కొందరు అభిమానులు విడాకులకు గల బలమైన కారణం గురించి వెతికే పనిలో పడ్డారు. అయితే అభిమానుల ఫోకస్ ఇపుడు సమంత డిజైనర్ కమ్ స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకాల్కర్‌ (Preetham Juklarkar)పై పడింది. చై-సామ్ విడాకులకు కారణం ఇతడే కారణం అని కొందరు నిందిస్తున్నారు. సమంతతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వారిద్దరి మధ్య తగాదాలకు కారణమయ్యాడని అభిమానులు ప్రీతమ్‌ జుకాల్కర్‌ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 


ఈ ట్రోలింగ్ పై సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌ సాధనా సింగ్‌ (Sadhana Singh) ఏమన్నారంటే... "సమంత- ప్రీతమ్ ఇద్దరు మంచి మిత్రులు, ప్రీతమ్ సమంతను జీజీ అని పిలుస్తాడు. జీజీ అంటే అక్క అని అర్థం.. వారి మధ్య ఉన్న అక్క-తమ్ముళ్ల బంధాన్ని ఎందుకు తప్పుగా చిత్రీకరిస్తున్నారు అంటూ వాపోయింది. అంతేకాకుండా "దేవుడు నాకు తెలివినిచ్చాడు.. దీన్ని కొంత మందికి పంచుదామని అనుకుంటున్నా అని"  ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 


Also Read: Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి