Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్

Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో 2021కి గాను నోబెల్ ​బహుమతిని బెంజమిన్​ లిస్ట్​, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్​మిలన్​ దక్కించుకున్నారు. అణు నిర్మాణానికి ఉపయోగపడే.. అసిమెట్రిక్​ ఆర్గానోకెటాలిసిస్​ను అభివృద్ధికి దోహదం చేసినందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 04:52 PM IST
  • రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు ప్రకటన
  • బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లను వరించిన నోబెల్
  • అసిమెట్రిక్‌ ఆర్గానో క్యాటలసిస్‌ అభివృద్ధి చేసినందుకు పురస్కారం
Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్

Nobel Prize in Chemistry: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఇద్దరిని వరించింది. అసిమెట్రిక్‌ ఆర్గానో క్యాటలసిస్‌(asymmetric organocatalysis)ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్‌మిల్లన్‌(David MacMillan )లకు 2021గానూ నోబెల్‌ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ప్రకటించింది. 

‘అణువులను నిర్మించడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటిది పరమాణువు నిర్మాణంలో ఆర్గానో క్యాటలసిస్‌ అనే స్పష్టమైన నూతన విధానాన్ని బెంజిమిన్‌ లిస్ట్‌(Benjamin List), డేవిడ్‌ మెక్‌మిల్లన్‌ అభివృద్ధి చేశారు. ఇది ఔషధాల పరిశోధనల్లో గొప్ప ప్రభావం చూపించింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చింది’’అని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ అభిప్రాయపడింది. ఈ క్యాటలసిస్‌ను శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో అభివృద్ధి చేసినట్లు తెలిపింది. వీరి కృషి ఇప్పటికే మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని ప్రశంసించింది. 

Also Read: Nobel Prize in Physics 2021: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

సోమవారం వైద్య శాస్త్రంలో (nobel prize medicine 2021) నోబెల్​ బహుమతిని ప్రకటించగా.. అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. మంగళవారం భౌతిక శాస్తంలో(Nobel prize for physics 2021) నోబెల్ పురస్కారం ప్రకటించంగా.. సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలు ఎంపికయ్యారు.

ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు. ప్రైజ్ మనీ సృష్టికర్త, స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) 1895 లో మరణించారు. అప్పటి నుంచి ఆయన పేరుతో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి నోబెల్ బహుమతిని అందజేస్తున్నారు. వైద్య శాస్త్రంతోపాటు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్ర రంగాలలో అత్యుత్తమమైన సేవలందించినవారికి ఈ  బహుమతి ప్రకటిస్తుంటారు.

Also Read: Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News