Samantha Making Big Mistake: ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ లోనే కాదు తమిళ సినీ పరిశ్రమలో సైతం స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన సమంత ఇప్పుడు తెలిసే తప్పు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలా డిప్రెషన్ కి లోనైంది. ఆ తర్వాత ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా బయటపడడంతో ఎట్టకేలకు చాలా ప్రయత్నాలు చేసి ఆమె వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఒకపక్క అనారోగ్యంతో బాధపడుతూనే మరోపక్క ఆమె వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అందులో భాగంగా ఆమె సీనియర్ హీరోల పక్కన లేక తన అంటే ఎక్కువ వయసున్న హీరోలు పక్కన సినిమాలు చేయలేకపోతోంది. అవకాశాలు రావడం లేదో  లేక కథలు నచ్చకో సమంత ఒప్పుకోవడం లేదో తెలియదు. కానీ ఆమె సరిగ్గా స్టార్ హీరోల సరసన నటించి చాలా కాలమే అయింది.


Also Read: Anni Manchi Sakunamule Review: అన్నీ మంచి శకునములే' రివ్యూ..ఎలా ఉందంటే?


చివరిగా ఆమె యశోద, శాకుంతలం సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో ఆమె పక్కన నటించిన మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారే అది కూడా ఆమె కంటే వయసులో చాలా తక్కువ వారే. ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి అనే సినిమా చేస్తోంది. వయస్సు ప్రకారం చూస్తే విజయ్ దేవరకొండ కూడా సమంతకంటే చిన్నవాడే.


ఇక ఆ సంగతి పక్కన పెడితే నందినీ రెడ్డి సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా సమంతను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ విషయాన్ని నందిని రెడ్డి దాటవేసే ప్రయత్నం చేశారు కానీ ఆమె సమంతను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లుగానే చెబుతున్నారు. అయితే శాకుంతలం సినిమా విషయంలో సమంత లుక్స్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. 


సమంత ముదురు ముఖంలా కనిపిస్తోందని దానికి తోడు దేవుని మొహంతో ఏ మాత్రం కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని వాదనలు వినిపించాయి. ఇప్పుడు కూడా ఆమె మరింత యంగ్ హీరోలతో నటిస్తే వారి పక్కన ఆమె కాస్త ముదురుగా కనిపించి అసలుకే మోసం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా ఇదంతా తెలిసి కూడా సమంత మొండిగానే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం గమనార్హం. చూడాలి భవిష్యత్తులో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది.


Also Read: Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా చీరలో హాట్ ట్రీట్.. చూశారా?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి