Samantha - Naga Chaitanya Divorce: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతాయో .. అంతే వేగంగా విడాకులు తీసుకొని హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత, నాగ చైతన్యల పెళ్లి ఎంతో వైభవంగా రెండు భిన్న సంప్రదాయాలకు అనుగుణంగా జరిగింది. వీరి పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఎవరి కన్ను కుట్టిందో కానీ.. రెండేళ్ల క్రితం వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు విడిపోవడానికి రకరకాల కారణాలు మీడియాలో చర్చకు వచ్చాయి. అప్పట్లో ఇంట్లో వాళ్లకు విరుద్ధంగా ఓ వెబ్ సిరీస్‌లో హాట్ సీన్స్‌తో పాటు బోల్డ్‌గా  నటించిన కారణంగా సమంతకు నాగ చైతన్య విడాకులు తీసుకున్నారనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇలా ఎవరుకీ తోచిన కామెంట్స్ వారు సోషల్ మీడియాలో వెల్లడి చేస్తూ వచ్చారు.
   
ఇక వీళ్లిద్దరు విడిపోవడానికి కారణంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఓ కారణమని తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌) షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల నుంచి జడ్జీల ఫోన్‌ వరకు అందరి ట్యాపింగ్ చేశారనే విషయం డీఎస్పీ కేసు విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగానే సమంత, నాగ చైతన్య ఇద్దరు విడిపోయినట్టు తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. ఈ సందర్భంగా సమంత ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని.. ఆమెతో కొన్ని బేరసారాలు చేసినట్టు చెబుతున్నారు. ఆమె ఇలాంటి బ్లాక్ మెయిల్స్‌కు లొంగలేదు. దీంతో సమంతకు సంబంధించిన సదరు వీడియోను నాగ చైతన్య కుటుంబ సభ్యులకు ఇచ్చాచారు. వీళ్లిద్దరు విడిపోవడంలో తెలంగాణకు బడా లీడర్ ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఆయన మందుల వ్యాపారం చేస్తాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది కూడా చూడాలి.


సమంతతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపించడం షాకింగ్‌కు గురిచేస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బలైన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఉన్నారనే విషయం బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంగా తమకు అడ్డుగా ఉన్నవారిని, తమకు పోటీకి వస్తున్న వారిని అప్పటి అధికార పార్టీ నాయకులు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తమ దారిలోకి తెచ్చుకునేవారినే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పచ్చగా ఉన్న కాపురాల్లో కూడా చిచ్చు పెట్టిందనే వార్త సినీ ఇండస్ట్రీని సైతం కుదిపిస్తోంది.


Also Read: Pawan Kalyan: జనసేనకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం.. ఇకపై ఏపీలో రణరంగమే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook