Samanth Comments on Divorce: పెళ్లనేది కొంతమందికి నూరేళ్లపంట.. అయితే మరి కొంతమందికి మాత్రం పీడకలగా మిగిలిపోతూ ఉంటుంది. కారణాలు ఏవైనా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం అనేది అంత సహజమైన విషయం అయితే కాదు. మామూలు ప్రజలన్న విడాకులు తీసుకున్న కొద్దిరోజులకు ఆ విషయం గురించి మరిచిపోగలుగుతారేమో కానీ.. సెలబ్రిటీస్ తీసుకుంటే వారి అభిమానులు ఆ విషయం గురించి జీవితాంతం ఏదో ఒక సందర్భంలో గుర్తుచేస్తూనే ఉంటారు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ నాగచైతన్య సమంత జంట. వీరిద్దరూ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. వీరిద్దరి ఫాన్స్ మాత్రం ఇప్పటికి వారిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు చర్చలు చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీడియా వారు కూడా నాగచైతన్యని సమంత గురించి, సమంతని నాగచైతన్య గురించి అడగడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా సమంత మరోసారి తన విడాకులు గురించి స్పందించడంతో ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


నాగచైతన్యతో విడాకుల సందర్భాన్ని నటి సమంత పాడ్ కాస్ట్ లో మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘నాకు మయోసైటీస్ రావడానికి ముందు ఏడాదంతా విడాకుల కారణంగా చాలా కష్టంగా గడిచింది. చివరకు ఒక రోజు నాకు శాంతి లభించింది అప్పుడు నేను, నా మేనేజర్ ముంబై నుంచి వస్తున్నాం. చాలా ప్రశాంతంగా. రిలాక్సిడ్ గా ఉన్నానని తనతో అన్నాను అంతే ఆ తర్వాత నిద్ర లేచేసరికి ఈ అనారోగ్యం దాడి చేసింది’ అని పేర్కొన్నారు. 


నాగ చైతన్య విడాకుల గురించి తక్కువగా మాట్లాడగా.. సమంత మాత్రం ఇప్పటికే పలుమార్లు పలు ఇంటర్వ్యూస్ లో తాను విడాకులు వల్ల పడిన బాధను వివరిస్తూ వచ్చింది. కాగా ఆమె బాధను చూసి ఆమె అభిమానులు ఆమెని సపోర్ట్ చేస్తూ ఉండగా, నాగచైతన్య అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో సమంతకి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. సమంత చేసే వ్యాఖ్యలు కరెక్ట్ కాదని కూడా వాదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై మరి నాగచైతన్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Also Readహరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..


Also ReadDengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook