Samantha Political Entry: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఖుషి' చిత్రంతో ఇటీవలే టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సామ్.. ఇప్పుడు మరో సంచలన విషయంతో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అయితే ఆమె త్వరలోనే రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సమంత రంగం ప్రవేశం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పట్లో స్టార్ హీరోయిన్ విజయశాంతి లాగా ఇప్పటీ స్టార్ హీరోయిన్ సమంత పొలికల్ ఎంట్రీ ఇవ్వనుంది అంతా అనుకుంటున్నారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నడుస్తున్న పొలిటికల్ పార్టీ భారత్ రాష్ట్రీయ సమితి (BRS) పార్టీలో సమంత చేరనున్నారని సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత ఇటీవలే నటించిన 'యశోద', 'శాకుంతలం' చిత్రాల ఘోర పరాజయం తర్వాత 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీని శివా నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 


హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత జోరుగా సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. సామ్.. ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్‌సిరీస్ లో నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రసారం కానుంది.  


Also Read: Samsung Galaxy F23 5G మొబైల్‌పై 37% తగ్గింపు..బ్యాంక్‌ ఆఫర్స్‌తో కేవలం రూ. 4,099కే పొందండి!   


అయితే సమంత తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తే.. సమంత మరిన్ని విమర్శలను కచ్చితంగా ఎదుర్కొవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 


మరోవైపు సమంత కొత్తగా ఏ సినిమాలను ఒప్పుకోకపోవడం వల్ల ఆమె రాజకీయ రంగ ప్రవేశం నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలకు తాను ఇచ్చిన డేట్స్ ను వెనక్కి తీసుకోవడం సహా అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 


విజయశాంతి దారిలో..
గతంలో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ రాణించి విజయశాంతి.. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. తొలుత తెలంగాణ పార్టీ స్థాపించిన ఆమె.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ (BJP) లో ఉన్నారు. ఇప్పుడు నటి సమంత రాకతో తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.


Also Read: Ganesh Chaturthi 2022 Date: వినాయక చవితి ప్రత్యేకత, విగ్రహా ప్రతిష్ఠి సమయం, చవితి ప్రత్యేక తిథులు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook